29.7 C
Hyderabad
May 2, 2024 03: 59 AM
Slider విజయనగరం

విజయనగరం జిల్లా స్థాయి అధికారుల‌ను ప‌ట్టి పీడిస్తున్న మ‌హ‌మ్మారి

#vijayanagaramcollector

క‌రోనా..ఏడాది క్రితం భ‌యకంపితుల‌ను చేసిన ఈ క‌రోనా…గ‌తేడాదంతా భ‌యాందోళ‌న‌ల‌తో అందరూ కోలుకున్నారు. తాజాగా ఏడాది ప్రారంభం నుంచీ థ‌ర్డ్ వేవ్ అంటూ వ‌స్తున్న పుకార్లు,వదంతుల‌తో ప్ర‌జ‌లు ఆందోళ‌న‌లు చెందుతున్నారు. అందుకు ఉదాహ‌ర‌ణే జిల్లా స్థాయి అధికారుల‌కు  క‌రోనా రావ‌డ‌మే.

ఇటీవ‌లే తిరుప‌తి వెళ్లి వ‌చ్చిన జిల్లా క‌లెక్ట‌ర్ కు క‌రోనా రావ‌డంతో బంగ్లాకే ప‌రిమితం అయ్యారు. అయితే  ఓ జిల్లా స్థాయి అధికారే క‌రోనా వ‌చ్చి  ఆఫీసుకు రాకుండా…జిల్లా  ప్ర‌జ‌ల‌లో మ‌రింత భ‌యాందోళ‌న‌లు తీసుకు వెళ్లే వార‌ము అవుతామ‌నో లేక‌…ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై మ‌న‌మే వెన‌క‌డుగువేస్తే ఎలాగ‌నే  ఫ‌స్ట్ క్లాస్ మెజిస్ట్రేట్….ప్ర‌తీ వారం నిర్వ‌హించే స్పంద‌న‌ను ఆన్ లైన్  లో నిర్వహించ‌సాగారు.

అదీ  క‌లేక్ట‌రేట్ ఆడిటోరియంలో గ‌దులు మూసేసి మరీ నిర్వ‌హించింది..జిల్లా యంత్రాంగం. ఇక క‌లెక్ట‌ర్ తో పాటు డీఆర్ ఓ కు అలాగే ఆర్డీఓకు కూడా క‌రోనా సోకిన‌ట్టు క‌లెక్ట‌రేట్ వ‌ర్గ స‌మాచారం దీంతో  డీఆర్ ఓ ఆఫీసుకు రాక‌పోగా….ఆర్డీఓ  బంగ్లాకే ప‌రిమితం అయిన‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రెవిన్యూ  శాఖ‌తో పాటుపోలీస్ శాఖ‌కు క‌రోనా శ‌ర‌వేగంగా సోకింది.

ఇప్పటికే ఆ క‌రోనా వేవ్ ప‌ట్ల ఆర్మర్డ్ డీఎస్పీ,స్పెష‌ల్ బ్రాంచ్ సీఐ,ఇద్ద‌రు సీఐల‌కు క‌రోనా సోకిన‌ట్టు స‌మాచారం. కాగా ఇటీవ‌ల ఒక్క‌రోజే దాదాపు 1000కి పైగా  క‌రోనా కేసులు రావ‌డంతో జిల్లా యంత్రాంగం ఒక్క‌సారి అప్ర‌మ‌త్తం మైంది. ఓవైపు రెండు డోసు ల‌తో పాటు బూస్ట‌ర్ డోస్ లు వేసుకోమ‌ని చెబుతోంది స‌త్యం న్యూస్.నెట్.

Related posts

తీవ్రతుపాను నుంచి తుఫానుగా బలహీనపడిన అసని

Satyam NEWS

రూరల్ నియోజకవర్గం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది

Satyam NEWS

దుప్పట్లు పంపిణీ చేసిన ఏకాంబరి దేవస్థానం ట్రస్ట్

Sub Editor

Leave a Comment