28.7 C
Hyderabad
May 6, 2024 09: 50 AM
Slider శ్రీకాకుళం

కేజీబీవీ అధ్యాపకులకు పనికి తగ్గ వేతనం కల్పించాలి

#privateteachers

కేజీబీవీ అధ్యాపకులకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం జిల్లా కే.జీ.బీ.వీ, పిజి.టి సంఘ ప్రధాన కార్యదర్శి ఎం. స్నేహ బిందు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందచేశారు. ప్రభుత్వ కొలువు దొరికితే జీవితానికి భద్రత లభిస్తుందని గంపెడాశ తో కస్తూరీ బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పార్ట్ టైమ్ అధ్యాపకులుగా విధుల్లో చేరామని ఆమె తెలిపారు.

పుల్ టైమ్ పద్దతి లో విధులు నిర్వహిస్తున్నా తమకు పార్ట్ టైమ్ వేతనమే ఇస్తున్నారని ఆమె అన్నారు. బీ.ఈడి. ఎం.ఈడి, పీ. జీ., పి హెచ్.డి, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లాంటి అన్ని విద్యార్హతల తో తాము పార్ట్ టైమ్ అధ్యాపకులుగా విధుల్లో చేరినా తమకు న్యాయం జరగడం లేదని ఆమె అన్నారు. 2018 లో తామంతా  క్యాష్ టు, రోస్టర్, మెరిట్ , కలెక్టర్  ఇంటర్వ్యూ ద్వారా నియామకం పొందామనీ, అయినా..నేటికీ తమకు ఉద్యోగ భద్రత విషయమై అతి, గతీ లేదనీ ఆందోళన వ్యక్తం చేశారు.

కస్తూరీ బా గాంధీ బాలికా విద్యాలయాల్లో టెన్త్, ఇంటర్ ఫలితాల్లో 85 నుంచి 90 శాతం  వరకూ మెరుగైన ఉత్తీర్ణత సాధనలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ నేటికీ తమ వేతనం 12,000వేలు మాత్రమేనని వారు ఆవేదన వ్యక్తంచేశారు. అదేవిధంగా ఎంసెట్ జాతీయ స్థాయిలో  నిర్వహించే  జేఈఈ పోటీ పరీక్షలకు విద్యార్థులకు ప్రత్యేక క్లాజులు కూడా ఇస్తున్నట్లు తెలిపారు.

అధ్యాపకులుగా విధుల్లో చేరిన  తామంతా కే.జి. బీ.వి.ల్లో విద్యాబోధన తో పాటు వార్డెన్, నైట్ వాచ్ మెన్,కేర్  టేకర్, వంటి అదనపు విధులు తో పాటు కౌమార దశలో బాలికలకు తలెత్తే ఆనేక ఆరోగ్య సమస్యల పై అవగాహన, చైతన్య కల్పించి వారి ఆరోగ్య పరిరక్షణకు సైతం కృషి చేస్తున్నామని తెలిపారు. అందువల్ల తమ సర్వీసులు రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల కు కల్పిస్తున్న అన్నీ సదుపాయాలు వర్తింపచేసి రూ.57 వేల రూపాయల వేతనం చెల్లించాలని వారు కోరుతున్నారు.

Related posts

బీరు బాటిళ్లు, విస్కీ సీసాలతో సాయిబాబాకు అభిషేకం

Satyam NEWS

[Best] _ What Will Lower Your Blood Pressure Immediately High Bp Homeopathy Medicine How To Control Your High Blood Pressure Naturally

Bhavani

టెన్షన్ రన్:కృష్ణానదిపరీవాహక ప్రాంతంలో భూప్రకంపనలు

Satyam NEWS

Leave a Comment