39.2 C
Hyderabad
May 4, 2024 21: 23 PM
Slider విశాఖపట్నం

విశాఖ ఉక్కును వ్యతిరేకిస్తున్న రాహుల్ గాంధీ

#sailajanath

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ ను కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తున్నారని పి సి సి అధ్యక్షుడు సాకే శైలజనాధ్ వెల్లడించారు. ప్రభుత్వ ఆస్తులను బిజేపి తన ఆర్ధిక స్వార్ధం కోసం తన గుప్పిట్లోకి తీసుకుంటోందని ఆయన అన్నారు. వైసిపి కూడా అందుకు వంతపాడుతోందని శైలజానాధ్ అన్నారు. రాష్ట్రంలో ఖాళీ భూములు కబ్జాకు గురవుతున్నాయి… కొండలు కూడా స్వాహా చేస్తున్నారు…భూముల్ని తాకట్టు పెట్టడం, అదానీకి కట్టబెట్టడం జరుగుతోంది..అని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్ గురించి ఏపి ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు‌. బిజెపి కేంద్రంలో ఏం చేస్తున్నా సిఎమ్ జగన్ కుక్కిన పేనులా వున్నారని ఆయన ఆరోపించారు. విశాఖ మన్యంలో దొడ్డి దారిన బాక్సైట్ తవ్వుకుపోదామని చూస్తున్నారు…. మన్యంలో  ఆరులైన్ల రోడ్డులు వేయడానికి సిద్దపడుతున్నారు….అని ఆయన తెలిపారు. మన్యాన్ని కాపాడుకుందామంటూ ఏప్రిల్ లో కాంగ్రెస్ పార్టీ తరపున పాదయాత్రలు చేస్తామని పిసిసి అధ్యక్షుడు తెలిపారు. ఆ యాత్రలో రాహుల్ గాంధీ స్వయంగా పాల్గొంటారని ఆయన వెల్లడించారు.

Related posts

ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు

Satyam NEWS

రాక్షసానందం పొందుతున్న సోషల్ మీడియా

Satyam NEWS

ఏపి సిఎస్ ఆదిత్యానాథ్ దాస్ పదవీకాలం పొడిగింపు

Satyam NEWS

Leave a Comment