27.7 C
Hyderabad
May 4, 2024 07: 55 AM
Slider ఖమ్మం

సంబంధిత పత్రాలు సమర్పించి వాహనాలను తీసుకోవాలి

#khammam police

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్లపై దొరికిన, వదిలి వెళ్లిన,ప్రమాదానికి, చోరీకి గురైన వివిధ రకాల 188  వాహనాలకు సంబంధించిన యాజమానులు సంబంధిత పత్రాలు సమర్పించి అయా వాహనాలు తిరిగి పొందాలని లేకుంటే 6 నెలలలో బహిరంగ వేలంపాట ద్వారా డిస్పోజల్  చేయనున్నట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.  

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో  సీజ్ చేసిన సంబంధిత వాహన యాజమానుల వివరాలు సేకరించి వారికి సమాచారం ఇవ్వడం జరిగిందని, అట్టి వాహనాలకు సంబంధించిన వివరాలు కూడా  పోలీస్ శాఖ అధికారిక  ఫేస్‌బుక్ ,ట్విట్టర్ లో పొందుపరచబడిందని తెలిపారు. 6 నెలల గడువు అనంతరం అయా వాహనాలను బహిరంగ వేలంపాట వేయబడుతుందని, కావున వాహనదారులు సంబంధిత పత్రాలు, సెల్ఫ్ అఫీడెవిట్ సమర్పించి వాహనాలు తీసుకెళ్లాగలరని సూచించారు.

మరిన్ని వివరాల కొరకు  రామోజీ రమేష్ ఏ.సి.పి ట్రాఫిక్ , సెల్ నంబర్ 9440904889, టి. సురేష్ ఇన్స్పెక్టర్ ట్రాఫిక్, సెల్ నంబర్ 9441454898 లేదా face book పోలీస్ అధికారిక వెబ్ సైట్ official website: www.tspolice.gov.in, ID: shokmmtrikmm@gmail.com, Twitter ID: cpKhammam@Khammamcp, లో మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చని ఖమ్మం పోలీస్ కమిషనర్  తెలియజేసారు.

Related posts

కార్పొరేట్‌ బానిసత్వమే బీజేపీ లక్ష్యం

Bhavani

ఆడ‌బిడ్డ‌ల‌కు అభ‌య‌హ‌స్తం…దిశ యాప్…!

Satyam NEWS

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు తిరుమలలో ఘన స్వాగతం

Satyam NEWS

Leave a Comment