34.2 C
Hyderabad
May 10, 2024 11: 21 AM
Slider నల్గొండ

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ముస్లిం మైనార్టీ బంధు ఇవ్వాలి

#muslim bandhu

ముస్లిం మైనార్టీలు అభివృద్ధి చెందటానికి దళిత బంధు తరహాలోనే ముస్లిం మైనారిటీల కూడా మైనారిటీ  బంధు ఏర్పాటు చేయాలని టి పి సి సి రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎండి.అజీజ్ పాషా డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం స్థానిక ముస్లింలు ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ఎండి.అజీజ్ పాషా పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కెసిఆర్ ముస్లిం మైనారిటీలకు అనేక వాగ్ధానాలు ఇచ్చి రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చారని అన్నారు.

కానీ రాష్ట్రంలో ముస్లింల స్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడి లానే ఉందని అన్నారు. జనాభాలో 15% శాతం ఉన్న ముస్లిం మైనారిటీ లకు 12% శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారని, ముస్లిం మైనార్టీలకు సబ్ ప్లాన్ అమలు చేస్తామన్నారు కానీ ఆచరణలో మాత్రం నేటికీ అది అమలు జరగలేదని ఆయన తెలిపారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7 సంవత్సరాల పైచిలుకు కాలంలో ముస్లిం మైనార్టీలకు ప్రతి సంవత్సరం ఇవ్వవలసిన కార్పొరేషన్ సబ్సిడీ ఋణాలు ఈ ప్రభుత్వం ఇంతవరకు ఒక్కమారు కూడా ఇవ్వలేదని అన్నారు.

గతంలో ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం ముస్లిం మైనార్టీలకు  సబ్సిడీ ఋణాలు ఇచ్చే వారని,తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పోస్టు, పాలకమండలి గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం శోచనీయమని,దీనిని బట్టి ముస్లిం మైనార్టీలపై ముఖ్యమంత్రి కెసిఆర్ కి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందని,దేశంలో ముస్లిం మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై వారి  స్థితిగతులపై గతంలో అనేక కమిషనర్లు ఏర్పాటు చేసిన జస్టిస్ రంగనాథ్ మిశ్రా,సచార్ కమిటీ, నివేదికలలో ఆర్థికంగా,సామాజికంగా,విద్య, ఉద్యోగ, రాజకీయంగా వెనుకబడ్డారని నివేదికలులో తెలపడం జరిగిందని ఆయన అన్నారు.

టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సుధీర్ కమిటీ ఏర్పాటు చేసి ముస్లింల స్థితిగతులపై కమిటీ వారు 17 నెలల సుదీర్ఘ అధ్యయనం చేసిన అనంతరం నివేదిక కూడా సమర్పించడం జరిగిందని,అందులో ముఖ్యంగా 85 శాతం ముస్లిం మైనారిటీ వర్గాలు దారిద్య్ర రేఖకు దిగువున ఉండి జీవనాలు కొనసాగిస్తున్నారని,అత్యంత పేదరికంలో కొట్టు మిట్టాడుతున్నారని,చాలా మంది ముస్లింలు విద్యా,ఉద్యోగ,ఉపాధి,లేక సామాజికంగా ఆర్థిక పరిస్థితులు అనుకూలించక కూలి-నాలి,వెల్డింగ్ షాపులో మెకానిక్ లుగా,వీధి వ్యాపారస్తులు గా,ఆటో డ్రైవర్లుగా వివిధ రూపాలలో జీవనాలు దయనీయ స్థితిలో   కొనసాగిస్తున్నారని అన్నారు.

వెంటనే కొంత మేరకైనా మైనార్టీలు అభివృద్ధి కావటానికి దళిత బంధు తరహాలో ముస్లింలకు ‘మైనారిటీ బంధువు’ను ప్రకటించి,ప్రతి ముస్లిం మైనార్టీ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో మొదటి విడతగా 38,000 వేల కోట్లతో బడ్జెట్ కేటాయించి మైనారిటీ బంధువుకు నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అజీజ్ పాషా డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీలు నాయకులు ఎండి.సిరాజ్,ఎస్.కె.జానీ భాయ్,ఎండి. మోయిన్,ఎండి.బాబా, ఎండి.ఎజాజ్,షేక్.అజ్ఞు,ముస్తఫా,రహీమ్, గౌస్,జానీ, షేక్.అలీషా,ఎస్.కె.ఖసిము, జహీర్,తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ఆది సాయికుమార్ బర్త్ డే సందర్భంగా ‘బ్లాక్’ ఫస్ట్ లుక్ విడుదల

Satyam NEWS

14న కాజ శ్రీ అగస్తేశ్వర స్వామి ఏడవ వార్షికోత్సవ మహోత్సవం

Bhavani

భాషను, సంస్కృతిని, కళలను ప్రోత్సహించుకోవాలి

Satyam NEWS

Leave a Comment