39.2 C
Hyderabad
May 4, 2024 22: 32 PM
Slider ఖమ్మం

జన హృదయాల్లో నిలిచిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్

#khammam police

ఆదర్శవంతమైన సమాజం కోసం తన జీవితాన్ని వెచ్చించి తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లి స్వరాష్ట్రం సాధించేలా కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్   జన హృదయాల్లో  నిలిచివుంటారని పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ అన్నారు. ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన త్యాగపూరిత సేవలను  స్మరించుకుంటూ ఖమ్మం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పోలీస్ కమిషనర్  ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి

నివాళులర్పించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయం లో జరిగిన ప్రొఫెసర్ జయశంకర్  జయంతి  సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడుగా, ఉద్యమ భావజాలవ్యాప్తి ప్రజల్లోకి తీసుకెళ్లి  సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేలా చేసి వారిలో రాజకీయ చైతన్యాన్ని నింపి స్వరాష్ట్రం సాధించేలా కృషి చేశారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో డీసీపీ ఇంజరాపు పూజ, డీసీపీ ఎల్ సి. నాయక్, అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్, అడిషనల్ డీసీపీ ప్రసాద్, అడిషనల్ డీసీపీ  ఏ ఆర్ కుమారస్వామి,   ఎ ఎస్ పి స్నేహ మెహ్రా,ఎఓ అక్తరూనీసాబేగం, ఏసీపీలు ప్రసన్న కుమార్ , రామోజీ రమేష్, అంజనేయులు,విజయబాబు,ఆర్ఐ రవి, సాంబశివరావు, సిఐలు సాంబరాజు, తుమ్మ గోపి,  పాల్గొన్నారు.

Related posts

కోనసీమ లో విధ్వంస ఘటనల వెనుక అరాచక  శక్తులు

Satyam NEWS

ప్రతీ హిందువు చోట శ్రీరామనవమి వేడుకలు…!

Bhavani

వైసీపీ మరో కీలక నేతపై సస్పెన్షన్ వేటు

Satyam NEWS

Leave a Comment