26.7 C
Hyderabad
May 12, 2024 08: 52 AM
Slider కడప

రిమ్స్ ఆసుపత్రిలో పసికందు అపహరణ…

#Rims Hospital

కడప నగర పరిధిలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శిశు అపహరణ కల కలం రేపింది. వివరాల్లోకి వెళితే.. చిన్న చెప్పలి గ్రామానికి చెందిన మహబూబ్ జాన్ డెలివరీ కోసం డిసెంబర్ 25న రిమ్స్ హాస్పిటల్లోని గైనకాలజీ వార్డు నందు అడ్మిషన్ పొందింది. 26న సిజేరియన్ ఆపరేషన్ ద్వారా మగబిడ్డకు జన్మనిచ్చింది.

ఆపరేషన్ అనంతరం వైద్యులు పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తూ వస్తున్నారు,కాగా మంగళవారం సాయంత్రం ఓ అపరిచితురాలు పరిచయం చేసుకుని బిడ్డను తన భర్తకు చూపిస్తానని బిడ్డను తీసుకెళ్లి పరిపోవడం జరిగింది.

అక్కాయపల్లెకు చెందిన 28 సంవత్సరాల సోనీ అనే మహిళ ఈ దురాగతానికి పాల్పడంతో అక్కడ ఒక్కసారిగా అలజడి చెలరేగింది. తనకు పిల్లలు లేరని, తన భర్త చనిపోయాడని ఉద్దేశ్యపూర్వకంగానే బిడ్డను తీసుకెళ్లినట్లు ప్రాథమిక విచారణలో తేలింది, బిడ్డ కనిపించడంలేదని తల్లి చెప్పడం తో హుటాహుటిన స్పందించిన రిమ్స్ సెక్యూరిటీ సిబ్బంది గాలింపు చర్యలు వెంటనే చేపట్టి నిందితురాలిని కడప నగరంలోని ఐటిఐ సర్కిల్ నందు గుర్తించి పట్టుకున్నారు.

వెంటనే నిందితురాలిని పట్టుకుని, బిడ్డను సర్వజన ఆసుపత్రికి తీసుకువచ్చి తల్లి చెంతకు చేర్చారు. బిడ్డ అపహరణ విషయం కాసేపు సర్వజన ఆసుపత్రిలో గందరగోళం సృష్టించింది. ఎట్టకేలకు బిడ్డ తల్లి చెంతకు క్షేమంగా చేరడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయమై రిమ్స్ ఆర్ఎంవో రాజేశ్వరి వివరణ కోరగా, బిడ్డ అపహరణను సెక్యూరిటీ సిబ్బంది త్వరగా గుర్తించి బిడ్డను తల్లి చెంతకు చేర్చినట్లు తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకకుండా భద్రతను మరింత పటిష్టం చేస్తామని తెలిపారు. ఈ ఘటనపై కడప రిమ్స్ పోలీసులు విచారిస్తున్నారు.

Related posts

కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం ఈవోగా వేమూరి గోపీ

Satyam NEWS

పిల్ల‌నిచ్చిన అత్తింటికే క‌న్నం వేసిన అల్లుళ్లు…!

Satyam NEWS

ఎన్నికల సమయంలోనే గిరిజనులు గుర్తుకొస్తారా…??

Bhavani

Leave a Comment