38.2 C
Hyderabad
April 29, 2024 20: 46 PM
Slider సంపాదకీయం

ఈ జీవోతో లోకేష్, పవన్ కల్యాణ్ లను అడ్డుకోవడం సాధ్యమేనా?

#Pawan Kalyan

రోడ్డు షోలు, బహిరంగ సభలు నిషేధిస్తూ జగన్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో లోకేష్ పాదయాత్రను, పవన్ కల్యాణ్ వారాహి యాత్రను అడ్డుకోగలదా? ఈ ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఇప్పటికే ప్రభుత్వంపై వ్యతిరేకత పెల్లుబుకుతున్నందున ఈ ఇద్దరు యాత్రలు ప్రారంభిస్తే పరిస్థితి మరింత దిగజారుతుందనేది వైసీపీ నేతల అంచనా.

అందుకోసమే ఈ యాత్రలకు అడ్డంకులు సృష్టించేందుకు ఈ జీవో విడుదల చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ జీవో తో రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాల నిషేధం సాధ్యమౌతుందా అనే అనుమానాలు అధికార పార్టీలోనే వ్యక్తం అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న రోడ్ షోలు, బహిరంగ సభలకు ప్రజాస్పందన విపరీతంగా వస్తున్నది. కందుకూరు సభలో జరిగిన తొక్కిసలాట, గుంటూరులో బట్టల పంపిణీ కార్యక్రమంలో జరిగిన సంఘటన సాకుగా చూపించి జగన్ ప్రభుత్వం ఈ జీవోను విడుదల చేసింది. జీవో విడుదల అయిన మరునాడే రాజమండ్రిలో సీఎం జగన్ రోడ్ షో నిర్వహించారు. విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా వీధుల్లోనే ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంలోనే ఈ జీవో కేవలం ప్రతిపక్షాలకు సంబంధించి జారీ చేసిందా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు సభల్లో జరిగిన సంఘటనలలో తెలుగుదేశం పార్టీలో కొంత నిరుత్సాహం తొంగిచూసింది. బహిరంగ సభల్లో ఇలాంటి సంఘటనలు జరిగితే ప్రజలు రావడానికి భయపడతారేమో అనే అనుమానం తెలుగుదేశం పార్టీలో తొంగి చూసింది. చంద్రబాబునాయుడు కొద్ది రోజుల పాటు బహిరంగ సభలు నిర్వహించకపోతే మంచిదేమో అనే సలహాలు కూడా ఇచ్చారు. అయితే ప్రభుత్వ పెద్దలు తొందరపడి ఈ జీవో విడుదల చేయడంతో ఇప్పుడు పరిస్థితి మళ్లీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారిపోయింది.

తెలుగుదేశం పార్టీని కట్టడి చేసేందుకు జగన్ అధికారాన్ని వాడుకుంటున్నారే చర్చ కూడా మొదలైంది. అధికార పార్టీ చేసిన ఈ తప్పిదంతో తెలుగుదేశం పార్టీ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అయింది. మళ్లీ తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో సానుభూతి వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే లోకేష్ పాదయాత్రను, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనను ఇలాంటి జీవోలతో అడ్డుకోవడం సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతున్నది. జనవరి 26 నుంచి లోకేష్ తన పాదయాత్రను కుప్పం నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ పాదయాత్రకు యువ గళం అనే పేరును నిర్ణయించారు. అదే విధంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కల్యాణ్ రణస్థలం నుంచి నిర్వహించే యాత్రకు యువశక్తి అని నామకరణం చేశారు.

ఈ ఇద్దరూ కూడా ఈ జీవో విడుదల అయినా సరే తమ ఏర్పాట్లలో తాము ఉన్నారు. ఏర్పాట్లు పూర్తి చేసుకుని యాత్ర ప్రారంభించేందుకు సమాయత్తం అవుతున్న ఈ యువ నేతలను అడ్డుకోవడం ఈ జీవోతో సాధ్యం అవుతుందా అనే చర్చ అందుకే తెరపైకి వస్తున్నది. ఈ జీవో సాకు తో చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ లను అరెస్టు చేస్తే మరిన్ని విపరీత పరిణామాలు తలెత్తతాయనడంలో సందేహం లేదు. పైగా అలా చేస్తే న్యూట్రల్ ఓటర్లు పూర్తిగా తెలుగుదేశం, జనసేన వైపు వెళ్లిపోతారు. అధికార వైసీపీకి పూర్తిగా సానుభూతి తగ్గిపోయి వచ్చే ఓట్లు కూడా రావు.

అందువల్ల జీవోను తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన చిన్న నాయకులపై ప్రయోగించాల్సిందే తప్ప అగ్రనేతలను కట్టడి చేసేందుకు వీలుఉండదని వైసీపీ నేతలే భావిస్తున్నారు. ఈ జీవోను ఉపయోగించి తెలుగుదేశం, జనసేన నాయకులపై కేసులు పెట్టినా వారిని తాత్కాలికంగా కట్టడి చేయడం తప్ప అరెస్టు చేసి జైలుకు పంపే వీలు ఉండదని కూడా వైసీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అందువల్ల తెలుగుదేశం, జనసేన నాయకులు ప్రజల్లో సానుభూతి పెరుగుతుందని, ఇది తమ పుట్టి ముంచుతుందని వారు చర్చించుకుంటున్నారు.

అనాలోచితంగా ఈ జీవోను విడుదల చేశారని కూడా అధికార పార్టీలోనే చర్చ జరుగుతున్నది. ఈ జీవో ప్రతిపక్షాల చేతికి తామే ఒక అస్త్రాన్ని ఇచ్చినట్లు అయిందని వారు అనుకుంటున్నారు. ఈ జీవోతో జగన్ ప్రతిష్ట పూర్తిగా మసకబారిపోయిందని కూడా వారు తమ అంతర్గత చర్చల్లో అనుకుంటున్నారు.

Related posts

ఎక్స్ ప్లోజన్: రామోజీ ఫిల్మ్ సిటీలో ఊహించని ప్రమాదం

Satyam NEWS

డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి

Murali Krishna

వనపర్తి నమ్మ చెరువు కట్ట ఆక్రమణకు  గురి కాకుండా కాపాడాలి 

Bhavani

Leave a Comment