27.3 C
Hyderabad
May 10, 2024 07: 41 AM
Slider హైదరాబాద్

ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో కిలోమీటర్‌ ఆధారిత నెలవారీ బస్‌పాస్‌లు

#Telangana State Road Transport Corporation

రాష్ట్రంలోని నెలవారీ బస్‌పాస్‌ దారులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో కిలోమీటర్‌ ఆధారంగా నెలవారీ బస్‌పాస్‌లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న శ్లాబ్‌ విధానాన్ని ఎత్తివేసింది. అంతేకాదు, టోల్‌ ప్లాజ్‌ రుసుం కూడా బస్‌పాస్‌తో పాటే వసూలు చేయనుంది. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ ఐపీఎస్‌ గారు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం నెలవారీ బస్‌పాస్‌ దారులకు టోల్‌ప్లాజా రుసుం వేరుగా వసూలు చేస్తున్నారు. బస్‌ పాస్‌ చూపించి.. ప్రతి రోజూ టోల్‌ప్లాజా టికెట్‌ను వారు తీసుకోవాల్సి ఉండేది. తాజాగా ఆ విధానాన్ని సంస్థ ఎత్తివేసింది. ఇక టోల్‌రుసుంతో పాటే నెలవారీ బస్‌పాస్‌ను మంజూరు చేయనుంది.


తెలంగాణలో ప్రస్తుతం 15వేల వరకు నెలవారీ బస్‌పాస్‌లున్నాయి. 100 కిలోమీటర్ల లోపు రెగ్యులర్‌గా ప్రయాణించే వారికి ‘మంత్లీ సీజన్‌ టికెట్‌’ పేరుతో పాస్‌లను సంస్థ ఇస్తోంది. నిత్యం ప్రయాణించే ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు ఈ పాస్‌లను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈ పాస్‌ తీసుకుంటే సాధారణ చార్జీతో పోల్చితే 33 శాతం రాయితీని సంస్థ ఇస్తోంది. 20 రోజుల చార్జీతో 30 రోజుల పాటు ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తోంది.
”ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌ నెలవారీ బస్‌పాస్‌ల్లో గతంలో శ్లాబ్‌ విధానం అమల్లో ఉండేది. ఉదాహరణకు.. ఒకరు 51 కిలోమీటర్లు ప్రయాణిస్తే శ్లాబ్‌ విధానం ద్వారా 55 కిలోమీటర్లకు నెలవారీ బస్‌పాస్‌ను మంజూరు చేసేది. ఇకమీదట 51 కిలోమీటర్లకే బస్‌పాస్‌ను ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది. శ్లాబ్‌ విధానాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే, టోల్‌ప్లాజా రుసుం కూడా బస్‌పాస్‌లోనే ఉండనుంది. ఈ నిర్ణయం నెలవారీ బస్‌దారులకు ఎంతో మేలు చేస్తుంది.” అని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ గారు తెలిపారు. ఈ సదుపాయాన్ని రెగ్యులర్‌ ప్రయాణికులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

Related posts

మాపై వ‌చ్చిన ఆరోపణల్లో నిజం లేదు: జీవితా రాజశేఖర్‌

Satyam NEWS

విదేశాల నుంచి వచ్చిన వారి ఇళ్లను తనిఖీ చేసిన ఎస్పి

Satyam NEWS

16న క‌నుమ నాడు ఎస్వీ గోశాల‌లో గోపూజ‌

Satyam NEWS

Leave a Comment