26.7 C
Hyderabad
May 12, 2024 09: 28 AM
Slider ముఖ్యంశాలు

ఓ తారక రామా ఓ సారి ఇటు రావా

ktr

సారూ కేటీఆర్ గారూ, మాది వెనుకబడిన ప్రాంతం సార్. మమ్మల్ని పట్టించుకునే వాళ్లు చాలా తక్కువ సార్. మీరు వస్తే గానీ మధ్యలో ఆగిపోయిన అభివృద్ధి పనులు మళ్లీ మొదలెట్టరు సార్. ఎటూ మా జిల్లాకు వస్తున్నారు కదా ఒక అరగంట ఇక్కడకు వచ్చిపోండి సార్…..

సారూ మీరు వస్తే  ఇక్కడి ప్రాంత ఈ సమస్యలను, అధికారుల తీరును పూర్తిగా కళ్ళారా చూసిన వాళ్లు అవుతారు. సమస్య పరిష్కరించే అవకాశం ఉంటుంది. మేం అభివృద్ధిని కోరుకుంటున్నాం. కానీ  ఇక్కడి టిఆర్ఎస్ పార్టీలో ఎవరికి వారు ఎవరి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. అభివృద్ధిని మరిచి పంతాలకు  పోతున్నారు.

దీనికి ఉదాహరణ గతంలో అంటే 2017 ఏప్రిల్ 4న అప్పటి గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలిస్తే అప్పుడు పురపాలక శాఖ మంత్రిగా ఉన్న మీరు కొల్లాపూర్ ప్రాంతానికి వచ్చారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా టిటిడి కళ్యాణ మండపం శంకుస్థాపన చేశారు. ఇప్పుడు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.

అయితే అక్కడ ఏదైనా కార్యక్రమం జరుగుతే అక్కడికి వచ్చే ప్రజల ద్విచక్ర వాహనల పార్కింగ్ లేదు. అప్పటి  మంత్రి జూపల్లి కృష్ణారావు రాజబంగ్లా ప్రహరి స్థలంలో ద్విచక్ర వాహనాలు నిలుపుకోవడానికి, వాహనాల పార్కింగ్ ఉండడానికి అవకాశం కల్పించారు. అందుకే అక్కడ టీటీడీ కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేయించారు. కానీ నేడు ఆ స్థలంలో కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది. జూపల్లి కృష్ణారావు స్థలంపై పోరాటం చేశారు.

కోర్టు వరకు వెళ్లారు.  స్టేట్ మున్సిపల్ అధికారి నుండి పనులను ఆపాలని స్టేటస్కో తెచ్చారు. అంతకన్నా ముందు మున్సిపల్ అధికారిని నిర్మాణ పనులకు అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కొన్ని రోజులు పనులు ఆగిపోయ్యాయి. ఇప్పుడు కొందరు కోర్టు నుంచి స్టే తెచ్చుకుని యధావిధిగా కాంప్లెక్స్ నిర్మాణం చేసుకుంటున్నారు. నిర్మాణం పూర్తి అవుతే అక్కడ రోడ్ పై రాకపోకలకు అవకావశమే ఉండదు. ఇది వాస్తవం.

ఇదిలా ఉంటే అదే 2017 ఏప్రిల్ 4న  శంకుస్థాపన చేసిన వాటిలో పురపాలక  కార్యాలయం కూడా ఉన్నది. పాత జైలు ఖానా స్థలంలో నిర్మాణం చేపట్టారు. ఒక కోటి అరవై లక్షలు  బడ్జెట్ తో నిర్మాణం చేపట్టారు. పునాదులు పూర్తిచేసుకుని పిల్లర్లు  వేసే సమయానికి జైల్ ఖానా అధికారులు వచ్చి ఈ స్థలంలో నిర్మాణం చేయడానికి వీలులేదు, ఇది జైలు కు సంబంధించిన స్థలం అంటూ నిర్మాణ పనులను ఆపారు. ఇప్పటి వరకు అలాగే ఉంది.

పాలకులు మారినా అది అలాగే ఉంది. దాని గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. మీ దృష్టికి వస్తే ఈ సమస్య పరిష్కరించే అవకాశం ఉందని మేం అనుకుంటున్నాం. అదేవిధంగా పట్టణ కేంద్రంలో  మూడు కోట్ల వ్యయంతో చేపట్టిన ఫుట్ పాత్ నిర్మాణాన్ని కూడా  నిలిపివేశారు.

ఎలాగో ఈ నెల 29న కొల్లాపూర్ నియోజకవర్గ వనపర్తి జిల్లా పాన్గల్ మండల కేంద్రానికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ  భూమి పూజకు  వస్తున్నారు అని  మీడియాలో ప్రచారం అవుతోంది. అదే సందర్భంగా కొల్లాపూర్ ప్రాంతాన్ని కూడా  వచ్చి చూసి   రోడ్డుపై నిలిచిపోయిన అభివృద్ధిని పనులను పరిశీలిస్తారని, పరిష్కరిస్తారని మా ఆశ. గతంలో విడుదలైన 20కోట్ల నిధులతో ఈ పనులు జరుగుతున్నాయి.

త్వరలో మున్సిపల్ ఎన్నికలు కూడా ఉన్నాయి. గుర్తుంచుకోండి సారూ మమ్ములను

ఇట్లు

కొల్లాపూర్ ప్రజలు

(పురపాలక శాఖ మంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్న కేటీఆర్ ఒక్క సారి వస్తే చాలని కొల్లాపూర్ పట్టణ ప్రజలు కోరుతున్నారు. రాజకీయాల మధ్యన పడి నలిగిపోతున్న అభివృద్ధి నుంచి తమను గట్టెక్కించాలని ఈ పట్టణ వాసులు కోరుతున్నారు)

Related posts

జగన్ గుడిపై విస్తృతంగా జరుగుతున్న చర్చ

Satyam NEWS

కేసీఆర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే

Bhavani

అంగరంగ వైభవంగా గణనాథుడు నిమజ్జన వేడుకలు

Satyam NEWS

Leave a Comment