39.2 C
Hyderabad
May 3, 2024 12: 24 PM
Slider ప్రత్యేకం

మెగుడు రేపిస్టు: భార్య 13 ఏళ్లకే గర్భవతి

disha murder

దిశ హత్య కేసు లో ఎన్ కౌంటర్ అయిన చెన్నకేశవులు భార్య వయసు 13 ఏళ్లు. ఆమె ప్రస్తుతం 6 నెలల గర్భవతి కూడా. ఆమెకు జరిగింది బాల్య వివాహం. ఈ విషయాలన్నీ అధికారులు ధృవీకరించారు కూడా. అందుకే చెన్నకేశవులు భార్యకు 18 ఏళ్లు వచ్చే వరకు బాలల సదనంలో రక్షణ కల్పిస్తామని అధకారులు చెన్నకేశవులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు.

అందుకు వారు నిరాకరించారు. తల్లిదండ్రులు లేకపోవడంతో చిన్నప్పటి నుంచి బాబాయి, నాయనమ్మ వద్ద ఆమె ఉండేది. చెన్నకేశవులును ప్రేమ వివాహం చేసుకున్న తరువాత అత్తగారింటికి వచ్చింది. ఆ బాలికకు మరో చెల్లెలు, తమ్ముడు ఉన్నారు. ప్రస్తుతం వాళ్లిద్దరు తమ బాబాయి ఇంట్లో ఉంటున్నారు. నారాయణపేట జిల్లా బాలల సంరక్షణ విభాగం గ్రామంలో ప్రాథమిక విచారణ జరిపింది.

ఆ బాలికకు సంబంధించిన వివరాలను పాఠశాల నుంచి సేకరించారు. ఆమెను ఇతర పిల్లలను సంరక్షణ కేంద్రానికి పంపిస్తారా అని అధికారులు అడిగారు. బాలిక చెల్లెలు తమ వద్దే ఉంటుందని, తమ్ముడిని సంరక్షణ కేంద్రానికి పంపిస్తానని వారి బాబాయి తెలిపారు.

Related posts

డిసెంబ‌ర్ 30న రిలీజ్ అవుతున్న మా ‘లక్కీ లక్ష్మణ్’

Satyam NEWS

ధ‌ర‌ణి మ‌రింత ఆల‌స్యం!

Sub Editor

ట్రైడ్@క్రైడ్:మంటలనుచూసి పారిపోయినఏటీఎందొంగలు

Satyam NEWS

Leave a Comment