పక్కనే కృష్ణా నది ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ఉన్నది. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉన్నది. అధికార పార్టీకి వలస వెళ్లిన ఎమ్మెల్యే వున్నారు. మాజీ మంత్రి వున్నారు. ఏమి లాభం? అన్ని ఉన్నా అల్లుని నోట్ల శని అన్నట్లు కొల్లాపూర్ పురపాలకలో గత ఐదు రోజుల నుండి ప్రజలకు మంచినీరు అందడం లేదు. కొల్లాపూర్ పరిధిలోని మిషన్ భగీరథ ద్వారా 22 వేల గ్రామాలకు మంచి తాగునీరు అందించాలని రాష్ట ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. అయితే ఇప్పుడు మహిళలు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. పాలకులు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. కొల్లాపూర్ ప్రాంత పాలకుల అధికారుల నిర్లక్ష్యానికి గత ఐదు రోజుల నుండి చుక్క నీరు ప్రజలకు అందడం లేదు. కేవలం వాటర్ ట్యాంక్ తో చాలీ చాలని నీరు అందిస్తున్నారు. కొల్లాపూర్ పురపాలక పరిధిలో మంచి నీటి సమస్యతో పట్టణ ప్రజలు రోడ్ ఎక్కారు. ప్రజలు వాటర్ ట్యాంక్ దగ్గర బిందెలతో క్యూ కట్టారు. బుధవారం ఉదయం ఏడుగంటల సమయంలో మహిళలు రోడ్డెక్కి ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. బస్సులు రోడ్ పై నిలిచిపోయాయి. కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని గాయత్రి జూనియర్ కాలేజ్ మెయిన్ రోడ్డు పై ఈసంఘటన జరిగింది. బస్సులను అడ్డుకొని ఖాళీ బిందెలతో మహిళలు నిరసన తెలిపారు. గత ఐదు రోజుల నుండి మంచినీరు రాకపోతే ఎలా అని ప్రశ్నించారు. మహిళలు తమ సమస్యను చెప్పుకున్నారు. పురపాలక అధికారులు నీళ్ల ట్యాంకీలతో సప్లై చేస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు నిరసన విరమించుకున్నారు. పాలకులు అధికారులు అధికారుల నిలర్లక్ష్యం వలనే ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా నాయకులుగా చెప్పుకునే వారు పట్టణ కేంద్రంలో పర్యటిస్తే ప్రజల సమస్యలు తెలుస్తాయని సలహా ఇచ్చారు.
previous post
next post