పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ముంపునకు గురి అవుతున్న కుడికిల్ల రైతుల సమస్యను పరిష్కరించాలని కొల్లాపూర్ ఎంఎల్ఏ బీరం హర్షవర్ధన్ రెడ్డి నేడు మంత్రి కేటీఆర్ ను కోరారు. కుడికిల్ల రైతుల సమస్య చాలా కాలంగా పెండింగులో ఉన్నందున తక్షణమే పరిష్కరించాలని, వారికి సరియైన నష్టపరిహారం చెల్లించాలని కేటీఆర్ కి ఎంఎల్ఏ వివరించారు. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ చొరవ తీసుకుని రైతుల సమస్యను పరిష్కరించాలని కోరడంతో సంబంధిత మంత్రి దృష్టికి తీసుకువెళతానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. అదే విధంగా కొల్లాపూర్ అభివృద్ధి కొరకు సహకారం అందించాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మంత్రి కేటీఆర్ ను కోరారు. కొల్లాపూర్ మున్సిపాలిటీ చాలా వెనకబడి ఉందని మున్సిపాలిటీ లో పలు అభివృద్ధి కొరకు ప్రత్యేక నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్ ను అడిగారు. మంత్రి స్పందన ఎంతో బాగున్నందున కొల్లాపూర్ సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని ఎంఎల్ఏ ఆశాభావం వ్యక్తం చేశారు.