హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ప్రతిపాదించిన పలు స్కై వేలకు రక్షణ శాఖకు చెందిన భూములు అవసరమైనందున వాటిని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కోరుతూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు వినతిపత్రం సమర్పించారు. ఢిల్లీలో నేడు రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయిన మంత్రి కేటీఆర్ రక్షణ శాఖ భూముల విషయం ప్రస్తావించారు. హైదరాబాద్ నగరానికి అతి ముఖ్యమైన హైదరాబాద్- నాగ్ పూర్, హైదరాబాద్- రామగుండం జాతీయ రహదారులపై ఈ స్కైవేలు నిర్మించాల్సిన అవసరం ఉందని, ఇవన్నీ రక్షణ శాఖ కు చెందిన భూములలోనే ఉన్నందున వెసులు బాటు కల్పించాలని ఆయన రక్షణ మంత్రిని కోరారు.
previous post