సరూర్ నగర్ ఇన్ డోర్ స్టేడియంలో ఆర్టీసీ పరిరక్షణకై సకల జనభేరి బహిరంగ సభ జరగనున్నది. నేటి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ జరిగే ఈ సభకు తెలంగాణ జన సమితి, బి జె పి, కాంగ్రెస్, టి టీ డి పీ, సీపీఐ, సిపిఎం, ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. 26 వ రోజు కు ఆర్టీసి సమ్మె చేరుకుంది. ప్రభుత్వ మొండి వైఖరి వల్ల అనేక మంది కార్మికులు చనిపోయారు. సరూర్ నగర్ సభ ద్వారా కార్మికులకు ఆత్మ స్టైర్యం కల్పించడంక ముఖ్య ఉద్దేశ్యమని సభ ను ఏర్పాటు చేస్తున్నజె ఏ సి తెలిపింది. ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్వహించతలపెట్టిన సకల జనుల సమరభేరి సభకు స్థానిక పోలీసులు అనుమతి నిరాకరించగా హైకోర్టు అనుమతించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు సభ నిర్వహించుకోవచ్చని కోర్టు సూచించింది. ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే వివిధ రూపాల్లో ఆందోళనలు చేసి ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలో కుటుంబ సభ్యులతో దీక్షలు కూడా చేపట్టారు. ఆర్టీసీ బస్సులను నడుపుతున్న తాత్కాలిక సిబ్బందికి, అద్దె బస్సు డ్రైవర్లకు, యాజమానులకు ఇక నుండి దయచేసి బస్సులు నపకండి సమ్మె కు సహకరించడని కూడా కోరారు. ఇప్పటికే రాష్ట్ర బంద్ నిర్వహించి ఆర్టీసీ కార్మికులు తమ నిరసనను ప్రభుత్వానికి చెప్పారు.
previous post