Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ కోట సీక్రెట్: ఎవరు అసమ్మతి నాయకుడు?

kollapur poster

రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితి నెలకొన్న కొల్లాపూర్ మునిసిపాలిటీలో ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతున్నాయి. స్థానిక టిఆర్ఎస్ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తన మనుషులకు టిఆర్ఎస్ బి ఫారాలు తెచ్చుకుని నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు అయిన జూపల్లి కృష్ణారావుకు పార్టీలో స్థానం లేకుండా చేయడానికి స్థానిక ఎమ్మెల్యే ఈ విధమైన ఎత్తుగడ వేయడమే కాకుండా హైదరాబాద్ వెళ్లి ఆయనపై టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కూడా ఫిర్యాదు చేశారు.

జూపల్లి కృష్ణారావు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. అయితే విచిత్రంగా కొల్లాపూర్ మునిసిపాలిటీలో పరిస్థితి మరొక విధంగా ఉంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రెబెల్స్ కు ప్రచారం చేస్తున్నారని కొల్లాపూర్ ఎమ్మెల్యే ఫిర్యాదు చేస్తున్నారు కానీ ఇక్కడి ఇండిపెండెంట్ అభ్యర్ధులు మాత్రం ఎమ్మెల్యే ఫొటోనే పెట్టుకుంటున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై అసమ్మతి ముద్ర వేస్తున్నారు కానీ ఇక్కడ మాత్రం ఎమ్మెల్యే ఫోటోతో రెబల్ అభ్యర్థి ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం టీఆర్ఎస్ అధిష్టానం కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

Related posts

‘ఢిల్లీ’ చీవాట్లతో మంత్రి కొడాలి నాని నోటికి తాళం

Satyam NEWS

పింఛన్‌ డబ్బులు పంచకుండా ప్రియురాలితో పరారైన వాలంటీర్‌

Satyam NEWS

మృతుడి కుటుంబానికి తస్లీమా పరామర్శ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!