బిచ్కుంద మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మరుగుదొడ్ల నిర్మాణంపై నేడు సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో ఆనంద్ మాట్లాడుతూ మరుగుదొడ్లు నిర్మించుకోని వారి వివరాలను త్వరితగతిన సేకరించాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ మేరకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలన్నారు. ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒతో పాటు బాన్సువాడ డీఎల్పీవో శ్రీనివాస్, ప్రత్యేక అధికారి శంకర్ ఎంపిఓ ఆనంద్ ఉపాధి హామీ అధికారులు పంచాయతీ కార్యదర్శిలు పాల్గొన్నారు.
previous post