ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆఫర్ మేరకు విధుల్లో చేరాలనుకునే ఆర్టీసీ కార్మికులకు పూర్తి భద్రత కల్పిస్తామని కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరైనా విధుల్లోకి చేరే RTC సిబ్బందిని కానీ, ఆర్టీసీలో పని చేసేందుకు వచ్చే ప్రైవేటు సిబ్బందిని కానీ అడ్డుకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు RTC కార్మికులు నిర్భయంగా విధుల్లోకి చేరవచ్చునని ఆయన తెలిపారు. అలాంటి వారికి పూర్తి భద్రత కల్పిస్తామని సిఐ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించినా వారిని భయబ్రాంతులకు గురి చేసినా చట్టప్రకారం కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలియచేశారు.
previous post