37.2 C
Hyderabad
April 30, 2024 12: 33 PM
Slider తెలంగాణ

కామారెడ్డి డిపోలో రిపోర్ట్ చేసిన డ్రైవర్

kamareddy bus 02

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన డెడ్ లైన్ తో కామారెడ్డి ఆర్టీసీ కార్మికుల్లో అంతర్మథనం మొదలైంది. ఉద్యోగంలో చేరకపోతే భవిష్యత్తు ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది. 3 నెలల్లో పదవి విరమణ చేయనున్న డ్రైవర్ హైమద్ డివిఎంకు తాను విధుల్లో చేరతానని రిపోర్ట్ చేసాడు. దాంతో నేడు చేపట్టే పల్లెబాట కార్యక్రమాన్ని జెఎసి నాయకులు విరమించుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. 5 వ తేదీ అర్ధరాత్రి లోపు కార్మికులు విధుల్లో చేరకపోతే ఆర్టీసీని ప్రైవేట్ చేస్తామని చెప్పడంతో కొందరు కార్మికులు ఆలోచనలో పడ్డారు. కామారెడ్డి డిపోలో డ్రైవర్ గా పని చేస్తున్న హైమద్ గత కొన్ని రోజులుగా సమ్మెలో పాల్గొంటున్నాడు. అయితే ముఖ్యమంత్రి విధించిన డెడ్ లైన్ తో భయాందోళనకు గురైన హైమద్ తాను విధుల్లో చేరతానని కామారెడ్డి డిపో డివిఎం గణపతికి లిఖిత పూర్వకంగా తెలియజేశాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రెండు నెలల నుంచి జీతాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. ఎన్నికల ముందు సమ్మె చేస్తే లాభం ఉండేదని, పండగ ముందు సమ్మె చేయడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని హైమద్ తెలిపాడు. యూనియన్ నిర్ణయం సరైనది కాదని చెప్పాడు. విషయం తెలుసుకున్న కార్మికులు హైమద్ కుటుంబ సభ్యులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా హైమద్ వెనక్కి తగ్గలేదు.

Related posts

ప్రపంచ అవసరాలకు అనుగుణంగా నూతన విద్యా విధానం

Satyam NEWS

ప్రజా రాజధానిపై కుట్ర పన్నిన వైసీపీ ప్రభుత్వం

Satyam NEWS

రెవెన్యూకు వెళ్లలేం.. మున్సిపల్ లో చేయలేం

Satyam NEWS

Leave a Comment