తెలంగాణ

నగర పంచాయితీ సిబ్బందికి ప్రత్యేక మెడికల్ క్యాంప్

koll medi

కొల్లాపూర్ నగర పంచాయితీ సిబ్బందికి ప్రత్యేకంగా నేడు ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. వైద్యులు మొత్తం 55 మంది నగర పంచాయతీ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి చైర్మన్ కాటం జంబులయ్య, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ భారత్ రావు, డాక్టర్ నజిముద్దీన్, డాక్టర్ యస్వంత్ రాణి, డాక్టర్ జయ చంద్ర ప్రసాద్, ఆప్తల్మిక్ అసిస్టెంట్ మురళి, ఫార్మసీస్ట్ జి.కె. వెంకటేష్, రవికుమార్, లాబ్  టెక్నీషియన్ అనిత, రహీం,ICTC కౌన్సిలర్ సురేందర్ గౌడ్, స్టాఫ్ నర్స్ అనూప తదితరులు పాల్గొన్నారు. ఈ మెడికల్ క్యాంప్ లో ముఖ్యంగా దంత సమస్యలు, నేత్ర సమస్యలు, చర్మ వ్యాధులకు సంబంధించిన సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించారు. అదే విధంగా సాధారణ వ్యాధులను కూడా చూసి మందులు ఇచ్చారు. ఇలా తమ కోసం ప్రత్యేకంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం పట్ల నగర పంచాయతీ సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు.

Related posts

అమిత్ షా తో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ భేటీ

Satyam NEWS

నిర్మాణదశలో కూలిన వేములవాడ రెండో బ్రిడ్జి

Satyam NEWS

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన యాంకర్ సుమ

Satyam NEWS

Leave a Comment