Slider మహబూబ్ నగర్

దసరాకు ఊరికెళ్తున్నారా? కొల్లాపూర్ పోలీసుల సూచనలు

#KollapurPolice

బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా వేరే ప్రాంతాలకు వెళ్లే వారికి పోలీసులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఇళ్లను సురక్షితంగా ఉంచుకునేందుకు తాము సూచించిన చర్యలు చేపట్టాలని నాగర్ కర్నూల్ జిల్లా  కొల్లాపూర్ సర్కిల్ పోలీసు సీఐ బి.వెంకట్ రెడ్డి కోరారు. కొల్లాపూర్ పోలీసులు సూచించిన జాగ్రత్తలు ఇవి:

1.ఉదయం/పగలు వేళలల్లో పేపర్లు, ఖాళీ సంచులు, పూల మొక్కలు, తదితర వస్తువులను విక్రయించే వారిపై నిఘా పెట్టాలి.

2. రాత్రివేళ అనుమానంగా కాలనీలో సంచరించేవారి గురించి పోలీసులకు సమాచారం వెంటనే అందించాలి.

3. శివారు కాలనీలలో తాళం వేసిన ఇండ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ వెతికినట్లు కనిపిస్తే అప్రమత్తం కావాలని కోరారు.

4. విలువైన వస్తువులను పక్కింటి వారికి ఇచ్చి నమ్మి మోసపోవద్దన్నారు. ఇరుగు పొరుగు వారిని తమ ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పి వెళ్లడం మంచిదని సూచించారు.

5. వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకుని వచ్చేలా చూసుకోవాలన్నారు.

6. పక్కింటి వారిద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవటం మంచిదన్నారు.

7. ఇంట్లో కుటుంబసభ్యులు వెళ్లగా ఉన్న మహిళలు, వృద్దుల వద్దకు అపరిచితులు సమాచారం కావాలంటూ వస్తే నమ్మవద్దని, ఏమరుపాటుగా ఉండవద్దని పోలీసులు హెచ్చరించారు.

8. ఊరు వెళ్ళేటప్పుడు ఖరీదైన వస్తువులను ఇంట్లో పెట్టకపోవటమే మంచిదన్నారు. వాటిని బ్యాంక్‌ లాకర్‌లో పెట్టుకోవాలన్నారు.

9. తాళం వేసి ఊరు వెళ్లే ముందు మీ సమీప పోలీస్‌ స్టేషన్‌లో సమాచారం ఇవ్వడంమంచిదన్నారు.

10. పోలీస్‌శాఖ వారికి దొంగతనాలపై అనుమానితుల సమాచారం అందించి దొంగతనాల నివారణకు సహకరించాలని కోరారు.

11. ప్రత్యేకంగా చుట్టు పక్కల వారి ల్యాండ్‌ఫోన్‌, సెల్‌ఫోన్‌ నంబర్లు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. 

12. ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వదలుచుకునేవారు సమీప పోలీస్‌స్టేషన్లను సంప్రదించాలని తెలిపారు.

13. రాత్రి సమయంలో బీట్, పెట్రోలింగ్ గస్తి ముమ్మరం చేయబడును.

14. బయటికేల్లేటప్పుడు తాళలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.

15. సొంత గ్రామాలకు వెళ్లే వారు స్థానిక పోలీస్ స్టేషన్ లలో సమాచారం ఇచ్చి వెళ్లాలని తెలిపారు.

16. ప్రజలు ఎలాంటి సమాచారం ఇవ్వాలన్న డయల్ 100 కాల్ చేసి  సమాచారం ఇవ్వాలి.

Related posts

కార్మిక, కర్షక పోరు యాత్రను విజయవంతం చేయాలి

Satyam NEWS

బ్లాక్ షీప్:సిపిశివకుమార్ అండతోనే ఆయుధాల మాయం

Satyam NEWS

ఆది సాయికుమార్ బర్త్ డే సందర్భంగా ‘బ్లాక్’ ఫస్ట్ లుక్ విడుదల

Satyam NEWS

Leave a Comment