26.7 C
Hyderabad
April 27, 2024 07: 52 AM
Slider పశ్చిమగోదావరి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా ను బర్తరఫ్ చేయాలి

#elurufarmers

కేంద్ర వ్యవసాయ చట్టాలపై ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అన్నదాతలను హత్య చేసిన  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశీష్ మిశ్రాను తక్షణమే అరెస్టు చేయాలని రైతు సంఘాల సమన్వయ కమిటీ డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల జిల్లా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని పాత బస్టాండ్ సెంటర్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సంతకాల కార్యక్రమం చేపట్టారు. కారుతో రైతులను తొక్కించి, తుపాకీతో కాల్పులు జరిపి నలుగురు రైతులను చంపివేసిన దుర్మార్గ ఘటనలను ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ షేక్ బాబ్జి తీవ్రంగా ఖండించారు.

రైతుల హత్యాకాండ కు నిరసనగా రైతు ఉద్యమ అమర వీరులకు పుష్పాంజలి ఘటిద్దాం.. రైతాంగ ఉద్యమాన్ని బలపర్చుదాం..నినాదంతో ముఖ్యఅతిథిగా విచ్చేసిన షేక్ సాబ్జి తొలి సంతకం చేసి మాట్లాడారు. దేశమంతా ఈ అత్యంత అమానుష ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ హత్యాకాండ పట్ల నిరసన వ్యక్తం చేసిందని చెప్పారు. ఈ ఘటనపై తక్షణమే మర్డర్ కేసులు నమోదు చేసి ఆశిష్ మిశ్రా, బిజెపి గుండాలను తక్షణమే అరెస్టులు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

కేంద్ర మంత్రిని పదవి నుంచి బర్తరఫ్ చేయాలి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా ను పదవి నుండి తొలగించాలన్నారు. కార్పొరేట్ కంపెనీల అనుకూల వ్యవసాయ చట్టాలు వలన దేశ ఆహార భద్రతకు పెను ప్రమాదం వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 500 రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా గా ఏర్పడి చారిత్రాత్మక  రైతాంగ పోరాటం గత పది నెలలుగా సాగిస్తున్నారని చెప్పారు. ఈ పోరాటం రైతుల కోసమే కాదని దేశ ప్రజలందరి భవిష్యత్తు కోసమని అన్నారు. రైతాంగ పోరాటాన్ని అందరూ సంపూర్ణంగా బలపరచాలని పిలుపునిచ్చారు. కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగ ఉద్యమాన్ని అణచివేయాలని ఎన్ని కుట్రలు పన్నినా ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు.

ఇంకా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చింతకాయల బాబురావు, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన రావు, ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి యూ. వెంకటేశ్వరరావు,బి.కె.ఎం.యూ జిల్లా ఉపాధ్యక్షులు పి.పెంటయ్య తదితరులు మాట్లాడుతూ లఖింపూర్ ఖేరి హత్యాకాండను అందరూ ఖండించాలని కోరారు.

రైతులకు మద్దతు గ్యారెంటీ చట్టం తీసుకురావాలి

రైతు వ్యతిరేక  వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పంటలకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50% కలిపి మద్దతు ధర నిర్ణయించి ఆ ధరలు అమలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తేవాలని కోరారు. ప్రజావ్యతిరేక కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి పి.కిషోర్, సిపిఐ నాయకులు కడుపు కన్నయ్య, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పి. రామకృష్ణ, చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ పి.ఆదిశేషు, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు కె.రవీంద్ర, కాంగ్రెస్ నగర నాయకులు గౌడ రంగబాబు, లంకా రామ్మోహన రావు, సాదే బాబు ప్రసాద్, ఐ ఎఫ్ టి యు నగర నాయకులు శ్రీనివాస్, ప్రసాద్ సిఐటియు నాయకులు ఎ.జాన్,  ఎం.సత్యనారాయణజ్ ఏఐటీయూసీ నాయకులు కె.భాస్కర రావు,జి. నాగేశ్వరరావు, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు జి.సురేష్ కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకులు జి. శేఖర్, కె.దుర్గాప్రసాద్, డిసిఓ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అన్నమయ్య జిల్లా పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడుగా చమర్తి

Satyam NEWS

వైసిపి దాడులపై అమిత్‌షాకు బిజెపి నేతల ఫిర్యాదు

Satyam NEWS

డప్పు రమేష్ జీవిత త్యాగం వెలకట్టలేనిది

Satyam NEWS

Leave a Comment