38.2 C
Hyderabad
May 2, 2024 19: 16 PM
Slider జాతీయం

వర్షo భీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి

#KomatireddyVenkatreddy

తెలంగాణకు తక్షణ సహాయం కింద రూ2000 కోట్లు ఇవ్వాలని ప్రధానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్విట్టర్ ద్వారా లేఖ ద్వారా కోరారు. కుండపోతగా కురిసిన భారీ వర్షాలతో తెలంగాణ నిండా మునిగిపోయిందని, జన జీవనం అస్తవ్యస్తమైందని ఆయన తెలిపారు. చేతి కొచ్చిన పంట నీట మునిగిందని ఆయన తెలిపారు.

ఈ విషయంలో తక్షణమే ప్రధాని నరేంద్ర మోడి స్పందించి తెలంగాణలో వర్ష భీభత్సంపై ఏరియల్ సర్వే నిర్వహించాలని కోమటిరెడ్డి కోరారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు జన జీవనానికే కాకుండా రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి.

వానలు, వరదలు వల్ల అన్నదాత నిలువునా మునిగి పోయాడు. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. చేతికొచ్చిన వరి, పత్తి సహ దాదాపు అన్ని పంటలు నీటిలో మునిగిపోయాయాని రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

కోసిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలు అన్నీ కూడా జలమయం అయ్యాయి. అనేక ప్రాంతాల్లో ఇళ్ళు నేలమట్టం అయ్యాయి. చాలా ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిని రవాణా వ్యవస్థ స్తంభించింది. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే ఇది కచ్చితంగా జాతీయ విపత్తు కింద ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోమటిరెడ్డి  పేర్నొన్నారు.

తక్షణమే ఈ విషయంలో ప్రధాని స్పందించి జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  వర్ష భీభత్సంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ లేఖలో మండిపడ్డారు. కేసీఆర్ ఇప్పుడు ఓట్ల రాజకీయాలపైనే దృష్టి పెట్టి భారీ వర్షాలను, వరద భీభత్సంలో ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదన్నారు.

కేసీఆర్ ఖజానాలో డబ్బులున్నాయి కానీ… తెలంగాణ ప్రభుత్వ ఖజానాలో పేద ప్రజలకు,రైతులకు ఇవ్వడానికి డబ్బులు లేవని కేసీఆర్ పై మండిపడ్డారు. అందుకే ఈ విషయంలో తక్షణమే కేంద్రం జోక్యం చేసుకుని వరద బాధితులను ఆదుకోవాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి  ప్రధాని నికోరారు.

Related posts

మునిసిపల్ మంత్రి కేటీఆర్ తో ఉప్పల్ ఎమ్మెల్యే భేటీ

Satyam NEWS

అన్ని కమర్షియల్ అంశాలతో “రాజయోగం” ట్రైలర్

Bhavani

మార్పులు, చేర్పులకు 1820 దరఖాస్తులు

Bhavani

Leave a Comment