33.2 C
Hyderabad
May 4, 2024 01: 12 AM
Slider ముఖ్యంశాలు

కృష్ణానదిలో రోజు రోజుకూ పెరుగుతున్న వరద

#Nagarjunasagar Dam

పశ్చిమ కనుమలతో పాటు కృష్ణానది ఉపనదుల పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదిలో రోజు రోజుకూ వరద పెరుగుతున్నది. ఈ రోజు 2.40 లక్షల క్యూసెక్కులకు వరద పెరిగింది. ఈ సీజన్ లో ఇదే అత్యధిక వరద. ఇదే వరద కొనసాగితే ఈ నెలలోనే సాగర్, శ్రీశైలం నిండే అవకాశాలు ఉన్నాయి.

శ్రీశైలం జలాశయానికి శనివారం సాయంత్రానికి 1.40 లక్షల క్యూసెక్కులకు పైగా వరద కొనసాగింది. ఆదివారానికి 2 లక్షల క్యూసెక్కులను, ఈ ఉదయం 2.40 లక్షల క్యూసెక్కులను దాటింది. ఎగువన ఉన్న ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వస్తుండటంతో, ప్రాజెక్టులు పూర్తిగా నిండకపోయినా, దిగువకు నీటిని వదులుతున్నారు.

ఈ నీరంతా శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలకు చేరుతోంది. ఈ సీజన్ లో శ్రీశైలానికి నమోదైన అత్యధిక వరద నీరు ఇదే. ప్రస్తుతం శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 40,259 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జలాశయంలో 855.90 అడుగుల నీటి నిల్వ ఉంది.

రిజర్వాయర్ పూర్తిగా నిండాలంటే ఇంకో 121 టీఎంసీల నీరు అవసరం. ఇదే సమయంలో నాగార్జున సాగర్ లో 559.40 అడుగులకు నీటి మట్టం చేరుకోగా, 230.99 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్ పూర్తిగా నిండాలంటే, మరో 82 టీఎంసీల నీరు అవసరం.

Related posts

ఎలక్షన్ ఫీవర్: అధినాయకుడికి ఇంత ఆందోళన ఎందుకో?

Satyam NEWS

మహిళలు రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగాలి

Satyam NEWS

ఫిజికల్ ఫిట్ నెస్ ఉంటే విధుల నిర్వహణ సమర్ధంగా ఉంటుంది

Satyam NEWS

Leave a Comment