41.2 C
Hyderabad
May 4, 2024 15: 08 PM
Slider వరంగల్

మహిళలు రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగాలి

rao padma

దాదాపు శతాబ్దం నుంచి మహిళలు అనేక రకాలుగా దోపిడీలకు గురవుతున్నారన్నా కానీ నేటి కాలంలో మగవారికి దీటుగా మహిళలు అన్ని రంగాల్లో మహిళలు ముందుంటున్నామని బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో హన్మకొండ హంటర్ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా  రావు పద్మ మాట్లాడుతూ సమాజంలో మహిళల పాత్ర ఎంతో అత్యున్నతమైందని, మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించ గలిగినప్పుడే ఉన్నత స్థాయికి చేరుకుంటామని అన్నారు.

సమాజంలో ప్రతి పనిలో మహిళల భాగస్వామ్యం ఉంటుందని, నవ సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర ఎంతో కీలకం అన్నారు. మహిళలు మహోజ్వలిత శక్తిగా ఎదగాలని పురుషాధిక్యాన్ని అధిగమిస్తూ ఇస్రో స్థాయికి ఎదిగిన మహిళలను అక్కడక్కడా హత్యలు, లైంగికదాడులు, అవమానాలను ఇంకా భరించాల్సిన పరిస్థితి ఉందని వాపోయారు.

నరేంద్ర మోడీ ప్రభుత్వం మహిళాభివృధికి, మహిళల సంక్షేమం, భద్రత కొరకు ఎంతో పెద్దపీట వేస్తుందని, మహిళలు పురుషులతో ఏమాత్రం తీసిపోరని చాటిచెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను అందిస్తోందన్నారు. స్త్రీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ పలు పథకాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచుతోందని తెలిపారు. మహిళలు అన్ని రంగాలలో ముందున్నప్పటికీ 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు అంటున్నప్పటికీ చట్టసభలలో, రాజ్యాధికారంలో మాత్రం అమలు కావడంలేదని అన్నారు.

స్త్రీలు రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగినప్పుడే వీటిని సాధించుకోగలం అని.. మహిళా హక్కుల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలనీ రావు పద్మ అన్నారు. ఈ  కార్యక్రమంలో బిజెపి రిటైర్డ్ టీచర్స్ & ఎంప్లాయీస్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ విజయలక్ష్మి, జిల్లా కార్యదర్శి స్నేహాలత , జిల్లా కోశాధికారి నవనగిరి నిర్మల, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు భవానీ, మహిళా మోర్చా జిల్లా నాయకులు జరీన, సులోచన, అనురాధ, తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోలేమా?

Satyam NEWS

ఏసిబి వలలో పరిగి ఎస్సై క్రాంతి కుమార్

Satyam NEWS

అత్యాచారం చేసే కామాంధులను బహిరంగంగా ఉరి తీయాలి

Satyam NEWS

Leave a Comment