31.7 C
Hyderabad
May 2, 2024 07: 25 AM
Slider మెదక్

ఫిజికల్ ఫిట్ నెస్ ఉంటే విధుల నిర్వహణ సమర్ధంగా ఉంటుంది

#medakpolice

వ్యాయామం కారణంగా మంచి శక్తి సామర్థ్యాలతో ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా విధులు నిర్వహించడానికి మంచి అవకాశం ఉంటుందని మెదక్ జిల్లా ఎస్ పి రోహిణి ప్రియదర్శిని అన్నారు. ఈ రోజు మెదక్ జిల్లా నూతన పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జిల్లాలోని సివిల్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్,హోం గార్డ్  సిబ్బందికి  వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఈ పరేడ్ కి జిల్లా ఎస్ పి రోహిణి ప్రియదర్శిని హాజరై గౌరవ వందనం  స్వీకరించారు. తరువాత సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, స్క్వాడ్ డ్రిల్, సిబ్బంది ప్రదర్శనని పరిశీలించారు.

ఈ సందర్బంగా ఎస్.పి మాట్లాడుతూ వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి, ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు శరీర దారుఢ్యం లభిస్తుందని అన్నారు. సమయం దొరికినప్పుడు సిబ్బంది అధికారులు వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యం అని ఆమె తెలిపారు. ఫిట్ నెస్ ను అనునిత్యం కాపాడుకోవాలన్నారు. చెడు అలవాట్లకు లోనుకాకుండా పోలీసులు మంచి జీవన విధానాన్ని అవలంబించాలన్నారు.

క్రమశిక్షణతో డ్యూటీలను నిర్వర్తించాలని మెదక్ జిల్లాకి , తెలంగాణ పోలీస్ శాఖకి మంచిపేరు తీసుకురావాలన్నారు. ఏదైనా వ్యక్తి గత సమస్యలు ఉన్నా, డ్యూటీల వద్ద సమస్య ఉన్నా, ఆరోగ్య సమస్య ఉన్నా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావలన్నారు. చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు  అలవాటు పడి, విధులలో నిర్లక్ష్యం వహించి రాదని అన్నారు. పోలీస్ శాఖ ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా ప్రవర్తించరాదని ఎస్ పి హితవు పలికారు. రెగ్యులర్ గా హెల్త్ చెక్ అప్స్ చేయించుకోవాలన్నారు. వ్యాయామాన్ని నిత్య జీవితంలోనూ భాగం చేసుకోవాలన్నారు.ఏ కార్యక్రమంలో ఆర్.ఐ నాగేశ్వర్ రావ్, ఆర్.ఎస్.ఐ నరేశ్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు

Satyam NEWS

శ్రీకాకుళం సంతోషిమాత అమ్మవారికి కుంకుమ పూజ

Satyam NEWS

ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి ఏంటో చూపిస్తా

Satyam NEWS

Leave a Comment