Slider హైదరాబాద్

హేట్సాఫ్: ఆ కుటుంబానికి వీరే ఆపద్భాంధవులు

maganti 171

హైదరాబాద్ ఎర్రగడ్డ సమీపంలోని ప్రేమ్ నగర్ కాలనీలో ఒక నిరుపేద కుటుంబంలో అనుకోని కష్టం వచ్చింది. భర్త బయటకు వెళ్లి కూలి చేసుకుని సంపాదించి తెస్తే పిల్నలను సాకేది ఒక తల్లి. ఆమె ఈ కరోనా కష్ట కాలంలో మరణించింది.

దాంతో ఇద్దరు చిన్న పిల్లలు, కూలిపని చేసే అతను ఏం చేయాలో అర్ధం కాని స్థితిలో పడిపోయారు. బయట పనిలేదు. చేతిలో డబ్బులేదు. భార్య చనిపోయింది. పిల్లల ఆకలి. ఏం చేయాలి? ఈ పేద కుటుంబం ఉన్న దయనీయ స్థితి రాష్ట్ర మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ కు తెలిసింది.

తక్షణమే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు ఆయన పరిస్థితి వివరించారు. అప్పటికే ప్రజలకు నిత్యావసర వస్తువులు పంచి పెట్టే కార్యక్రమంలో ఉన్న మాగంటి గోపీనాథ్ హుటాహుటిన ఆ కూలి వ్యక్తి ఇంటికి చేరుకున్నారు. లాక్ డోన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ల ఇంటికి వెళ్లి వారికి పిల్లకు కావాల్సిన పాలు, బిస్కెట్లు బియ్యం ,నిత్యవసర వస్తువులు ఆర్థిక సాయం అందించారు.

ఆ కుటుంబానికి ఇంకా సాయం చేయడానికి తన వంతు కృషి చేస్తా అని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ధీరోదాత్తుడు టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి నేడు

Satyam NEWS

గ్రాడ్యుయేట్ ఓటర్లను చేర్చేందుకు కార్యాలయం

Satyam NEWS

టీటీడీ చైర్మన్‌ భూమనపై ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు

Satyam NEWS

Leave a Comment