37.2 C
Hyderabad
May 2, 2024 13: 48 PM
Slider నిజామాబాద్

నిజాంసాగర్ మండలాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు

bichkunda 172

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని మాగి గోర్గల్,  బంజపల్లి,  వెలుగ నూరు, ఆరేడు గున్కుల్, మహ్మద్నగర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ దఫేదర్ శోభా రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో మండల కేంద్రాల్లో ప్రధాన కేంద్రాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేది కానీ కరోనా మహమ్మారి బారి నుండి రైతులను సంరక్షించేందుకు ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు.

రైతులు కూడా సామాజిక దూరం పాటించి ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి ఒకరి తర్వాత ఒకరు ధాన్యాలను తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాల సిబ్బందికి సహకరించాలన్నారు. అనంతరం హమాలీ కార్మికులకు స్థానికులకు మాస్కులు శానిటైజర్లను ఆమె  పంపిణీ  చేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ తో పాటు ఎంపిపి పట్లోళ్ల జ్యోతి దుర్గారెడ్డి, అచ్చంపేట సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి, గున్కుల్ సొసైటి చైర్మన్ వాజిద్ అలి, సిడిసి చైర్మన్ గంగారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విఠల్ ఆయా గ్రామాల సర్పంచ్ లు ఎంపీటీసీలు రైతులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

కరణం బలరాం కుమార్తె పట్ల ఓ డాక్టర్ ఓవరాక్షన్

Satyam NEWS

భారతీయుడు 2 చిత్రం షూటింగ్ లో ముగ్గురు మృతి

Satyam NEWS

ఎవేర్ నెస్: పరిశుభ్రత పాటిస్తే కరోనాను ఎదుర్కొనవచ్చు

Satyam NEWS

Leave a Comment