37.2 C
Hyderabad
May 6, 2024 11: 22 AM
Slider గుంటూరు

మహాశివరాత్రి కి ఆర్టీసీ ఏర్పాట్లు పూర్తి

మహాశివరాత్రి జాతరకు సంబంధించి ఏ పీ ఎస్ ఆర్ టి సి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు నరసరావుపేట డిపో నందు ఈరోజు రివ్యూ మీటింగ్ జరిగినది. ఈ కార్యక్రమంలో నెల్లూరు జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె ఆదం సాహెబ్ పాల్గొని కోటప్పకొండకు విచ్చేయు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అట్లాగే వివిధ డిపోల నుండి కోటప్పకొండకు వచ్చే బస్సుల వివరాలు మరియు టిక్కెట్ల రేట్ల విషయం కూడా సమీక్షించారు.

గత మూడు సంవత్సరాల నుంచి ఎటువంటి రేట్లు పెంచలేదని ఈ సంవత్సరం కూడా అలాగే అదే రేట్లతో నడుపుచున్నామని తెలియజేశారు. భక్తులందరూ కూడా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించి ఆర్టీసీ వారికి సహకరించాల్సిందిగా కోరారు.

వివిధ డిపోల నుండి కోటప్పకొండకు నడుపు బస్సుల వివరములు తెలిపారు. నరసరావుపేట నుండి కోటప్పకొండ క్రింది వరకు 185 బస్సులు అలాగే కొండ క్రింది నుంచి కొండపైకి 60+20 VIP వినుకొండ నుండి 35 చిలకలూరిపేట నుండి 120 బస్సులు నడుస్తాయి. అద్దంకి నుండి 25 ఒంగోలు నుండి 45 అలాగే చీరాల నుండి 45 బస్సులు నడుపుచున్నామని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్ వి శ్రీనివాసరావు, నరసరావుపేట డిపో మేనేజర్ బి వీరస్వామి అలాగే సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు పాల్గొన్నారు.

Related posts

పాఠశాలలు తెరుస్తున్నప్పుడు ఎన్నికల నిర్వహణకు ఇబ్బందేంటి?

Satyam NEWS

గాయపడ్డ వ్యక్తికి ఆస్పత్రికి తరలించిన పోలీసులు

Satyam NEWS

పేదలకు ఆహారం అందించిన మాధవరం రంగారావు యువసేన

Satyam NEWS

Leave a Comment