26.7 C
Hyderabad
May 1, 2025 04: 08 AM
Slider నిజామాబాద్

లేడీస్ స్పెషల్: బిచ్కుంద లో మహిళలకు ప్రత్యేక గ్రామసభ

gramasabha

కామారెడ్డి జిల్లా  బిచ్కుంద మండలంలో మహిళల సంరక్షణ కొరకు ప్రత్యేక గ్రామసభలు శనివారం జరిగాయి. ఈ సందర్భంగా ఆయా గ్రామ పంచాయతీలలో ప్రభుత్వం మహిళల కొరకు ఏర్పాటు చేసిన షీ టీంలు వాటిని వినియోగం తదితర అంశాలపై ఆయా గ్రామ పంచాయతీ గ్రామసభలో సర్పంచ్ లు వివరించారు.

సమాజంలో జరుగుతున్న  అకృత్యాలకు ఎన్నో అంశాలు కారణమని, వాటిని ఎదుర్కోవడానికి ఎప్పుడూ మహిళలు సమాయత్తంగా ఉండాలని బిచ్కుంద  సర్పంచ్ శ్రీరేఖ రాజు అన్నారు. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే 100సమాచారం ఇచ్చి తమని తాము కాపాడుకోవచ్చన్నారు.

ప్రభుత్వం కూడా మహిళల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మహిళలు  సమాజంలో సగర్వంగా బ్రతుక వచ్చన్నారు. అనంతరం పంచాయతీ కార్యాలయం ఆవరణలో మహిళల సంరక్షణకు  పాటించాల్సిన అంశంపై ప్రతిజ్ఞ చేశారు.

Related posts

ముగిసిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

బీజేపీని పంపేస్తే వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా

Satyam NEWS

సీఎం సొంత నియోజకవర్గంలో త్రాగు నీటి కోసం అలమటిస్తున్న ప్రజలు

mamatha

Leave a Comment

error: Content is protected !!