27.7 C
Hyderabad
May 14, 2024 07: 20 AM
Slider ఖమ్మం

భూసేకరణ త్వరగా చేయాలి

#collector

ఖమ్మం జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు చేపడుతున్న భూసేకరణ ప్రక్రియ ను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో భూసేకరణ, పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో నేషనల్ హైవే ల విస్తరణ పనులు చురుగ్గా జరుగుతున్నాయన్నారు.  ఖమ్మం – దేవరాపల్లి గ్రీన్ ఫీల్డ్ సెక్షన్ క్రింద జిల్లాలో 89.174 కి.మీ. పొడవు నకుగాను 1356.2025 ఎకరాల భూసేకరణ జరిగింది. ఇట్టి ప్రాజెక్టును 3 ప్యాకేజీలుగా విభజించడం జరిగిందని, భూసేకరణ పూర్తి చేసి, భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించామన్నారు.  కోదాడ-ఖమ్మం నాలుగు వరసల 22.35 కి.మీ. పొడవు గల రహదారి కొరకు భూసేకరణ పూర్తి చేయగా పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. నాగపూర్-అమరావతి (ఖమ్మం-వరంగల్ సెక్షన్) ప్రాజెక్ట్ కొరకు జెఎంఎస్ సర్వే ప్రక్రియ పురోగతిలో ఉందని ఆయన తెలిపారు. నాగపూర్-అమరావతి (ఖమ్మం-విజయవాడ సెక్షన్) ప్రాజెక్ట్ కొరకు జెఎంఎస్ సర్వే ప్రక్రియ పురోగతిలో ఉందన్నారు. ఖమ్మం-కురవి నాలుగు వరసల రహదారి కొరకు జెఎంఎస్ సర్వే ప్రక్రియ చేపట్టుతున్నట్లు ఆయన తెలిపారు. కొండపల్లి – కాజీపేట 3వ రైల్వే లైన్ విద్యుత్ సౌకర్యంతో నిర్మాణానికి గాను భూ సేకరణకు చర్యలు చేపట్టామని ఆయన అన్నారు. జిల్లాలో సీతారామ లిఫ్ట్ ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ కొరకు 6 మండలాలకు చెందిన 18 గ్రామాల నుండి భూ సేకరణ వివిధ దశల్లో వున్నదన్నారు. సింగరేణి కాలరీస్ కంపెనీకి సంబంధించి జేవీఆర్ ఓసి ప్రాజెక్ట్-II కు గాను భూసేకరణ కు అవార్డు పాస్ చేసి, భూనిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపు జరిగిందని ఆయన తెలిపారు.

Related posts

స్కూళ్లకు 48 రోజులు వేసవి సెలవులు

Bhavani

సిరిమాను చెట్టు తరలింపు: పోటెత్తిన భక్తజనం

Satyam NEWS

ట్రాజెడీ: భీమడోలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

Satyam NEWS

Leave a Comment