26.7 C
Hyderabad
May 16, 2024 08: 05 AM
Slider నల్గొండ

మునుగోడు లో 100కు పైగా నామినేషన్లు

#munugodu

మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం ముగిసింది. వందకు పైగా నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు పేర్కొన్నారు. చివరిరోజు ఒక్కరోజే 50కి పైగా నామినేషన్లు వేశారు. 15,16 తేదీలలో నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 17.కాగా ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయా పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. నవంబర్ 3న పోలింగ్‌ నిర్వహించనున్నారు. 6న ఓట్ల లెక్కించి, ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇక టీఆర్‌ఎస్ పార్టీ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ముగ్గురి మధ్య ప్రధాన పోటీ ఉంది. 2018 ఎన్నికల సమయంలో మునుగోడులో మొత్తం 33 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అయితే చివరగా 15 మంది మాత్రమే బరిలో ఉన్నారు. అయితే ఇది ఉపఎన్నిక కావడంతో నామినేషన్లు పెద్ద సంఖ్యలో దాఖలయ్యాయి.

Related posts

శరణు ఘోష తో మార్మోగిన ములుగు రామాలయం

Satyam NEWS

సిపిఐ బలోపేతానికి మిలిటెంట్ పోరాటాలు

Sub Editor 2

యజ్ఞానికి ఎవరైనా రావచ్చు

Bhavani

Leave a Comment