38.2 C
Hyderabad
April 28, 2024 19: 52 PM
Slider ముఖ్యంశాలు

సిరిమాను చెట్టు తరలింపు: పోటెత్తిన భక్తజనం

#sirimanu

అమ్మ సంబరానికి పకడ్బందీ ఏర్పాట్లు : డిప్యూటీ స్పీకర్ కోలగట్ల

ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి సినిమానోత్సవానికి ఏర్పాట్లు జోరందుకున్నాయి. అంబరాన్ని తాకే సినిమాను సంబరానికి కావాల్సిన చింత చెట్టును విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం జరజాపుపేట తుమ్మి అప్పారావు కల్లం నుంచి ఆలయ పూజారి ఇంటివద్దకు తరలించే కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. దీనిలో భాగంగా సిరిమాను చెట్టుకు ముందుగా సంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించారు. అనంతరం పలువురు ప్రజా ప్రతినిధులు , నేతలు చెట్టు నరికే ప్రక్రియను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భక్త జనం పోటెత్తింది. జై పైడిమాంబ నినాదాలతో ఈ ప్రాంతం మారుమ్రోగింది. ఈ సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్ర శేఖర్ , నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఛైర్మెన్ కేసలి అప్పారావు, మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడు, మాజీ ఎంపి బొత్స ఝాన్సీలక్ష్మి, నెల్లిమర్ల మున్సిపల్ ఉపాధ్యక్షులు సముద్రపు రామారావు,  ఆలయ ఈవో సుధారాణి, ప్రధాన పూజారి బంటుపల్లి వెంకట్రావు, ఆలయ కమిటీ సభ్యులు,  పలువురు నాయకులు, అధికారులు,  ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

అమ్మ సంబారానికి విస్తృత ఏర్పాట్లు : కోలగట్ల

ఉత్తరాంధ్ర ఇలవేలుపు పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి చెప్పారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాలకు అనుగుణంగా, పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. భక్తులంతా అమ్మవారిని దర్శించుకునే విధంగా క్యు లైన్లు ఏర్పాటు చేశామని, విఐపి పాసులు రద్దు చేశామని తెలిపారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

పైడిమాంబ ఆశీస్సులు అందరికీ ఉండాలి : జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు

శ్రీ పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు జిల్లా ప్రజలందరికీ ఉండాలని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. అమ్మవారి పండుగకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా, ఒడిషా, ఛత్తీస్ ఘడ్ తదితర రాష్ట్రాలనుంచి కూడా వేలాది మంది భక్తులు తరలి వస్తారని, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

Related posts

హన్స్ ఇండియా క్యాలెండర్ ఆవిష్కరించిన ములుగు ఎస్పి

Satyam NEWS

కేంద్ర ప‌థ‌కాల అమ‌లులో జిల్లా భేష్

Sub Editor

రెండు నెలల చిన్నారి అపహరణ

Satyam NEWS

Leave a Comment