రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ బదిలీలు, పోస్టింగ్‌లు జరిగాయి. జిల్లా కలెక్టర్లతో సహా అన్నిస్థాయిల్లో 21మందికి స్థాన చలనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఇందులో భాగం గా రాజన్న సిరిసిల్ల జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా కు పదోన్నతి దక్కింది.వనపర్తి జిల్లా కలెక్టర్ గా యాస్మిన్ బాషా ను బదిలీ చేశారు.గత మూడు సంవత్సరాలుగా యాస్మిన్ బాషా ఇక్కడ పని చేస్తూ విధినిర్వహణలో మంచి పేరు తెచ్చుకుంది.2017 లో మహిళా దినోస్త్సవం సందర్భం గా ఒకరోజు ఆమె రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం కలెక్టర్ సెలవుపై వెళ్ళినప్పుడు సైతం ఈ బాధ్యతలు నిర్వహించారు.పదోన్నతి ఫై వెళుతున్న ఆమెకు కలెక్టర్ కృష్ణ భాస్కర్ శుభాకాంక్షలు తెలిపారు.
previous post