31.2 C
Hyderabad
May 2, 2024 23: 45 PM
Slider మహబూబ్ నగర్

ఈ మున్సిపాలిటీ వారు చట్టం చదవరు..చెబితే వినరు..

#Kollapur Municipality

చట్టం, ధర్మం, న్యాయం అనే పదాలకు కొల్లాపూర్ మున్సిపాలిటీలో అర్ధం లేకుండా పోయింది. అంత పెద్ద మాటలు ఎందుకు కానీ కలెక్టర్ ఆదేశాలు, ప్రోటోకాల్ నిబంధనలు కూడా పాటించని రాజకీయం కొల్లాపూర్ మునిసిపాలిటీలో నడుస్తున్నది. దాంతో శాంతి భద్రతలకు ఆటంకం కలుగుతున్నది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీసుకువచ్చిన నూతన మున్సిపల్ చట్టంపై అవగాహన లేకుండా కొందరు స్వలాభం కోసం, రాజకీయ లబ్ది కోసం మాత్రమే పని చేస్తున్నారు. దాంతో పోలీసు అధికారులకు కూడా తలనొప్పిగా మారుతున్నది. జిల్లా కలెక్టర్ ఆదేశాలను, సూచనలు బేఖాతర్ చేస్తున్నారు.

నోటీసులు ఇవ్వకుండానే కూలగొట్టుడు

గురువారం పట్టణ కేంద్రంలోని 9వ వార్డులో శాలి భాష కు సంబంధించి శిథిలావస్థలో ఉన్న ఇల్లును మున్సిపల్ అధికారులు కూలగొట్టేందుకు సిద్ధమయ్యారు. కోర్టు నుండి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా  ప్రోటోకాల్ లేనివారు జెసిబి లతో  కూల్చేయించారు. అయితే ఈ విషయం ఎవరు చేయించారు?

ఎవరి ఆదేశాలతో చేయించారు? తెలియదు కానీ, ఆ వార్డు కౌన్సిలర్ కు కూడా ఈ విషయం తెలియదు. ఈ సంఘటన గురించి తెలుసుకున్నఆ వార్డు కౌన్సిలర్ నయీమ్ వెంటనే అక్కడికి చేరుకొని తన నిరసన వ్యక్తం చేశారు. అయినా అధికారులు వినకపోవడంతో బట్టలు విప్పి అర్ధనగ్నంగా జేసీబీ టైర్ల కింద పడుకొని నిరసన తెలిపారు.

పోలీసుల జోక్యంతో అదుపులోకి వచ్చిన గొడవలు

అంతలోనే విషయం తెలుసుకొని శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా ఎస్సై కొంపల్లి మురళి గౌడ్ అక్కడికి  చేరుకున్నారు. అప్పటికే  పక్క వార్డు కౌన్సిలర్ అయి 10వ వార్డు కౌన్సిలర్ రహీం అక్కడికి చేరుకున్నారు. నిరసన  విరమించుకోవాలని, ఏమైనా ఉంటే పిర్యాదు చేయాలని ఎసై కోరారు.

ఆ లోపు వాగ్వాదం చోటుచేసుకుంది. కొట్టుకున్నారు కూడా. ఇతర ఎసైలు అక్కడికి చేరుకున్నారు. ఎసై మురళి గౌడ్ జేసీబీ ని వెనక్కి పంపించారు. వారిని పోలీస్ స్టేషన్ కు వచ్చిమాట్లాడలని చెప్పారు. ఇది ఇలా ఉంటే వాస్తవంగా మున్సిపల్ నూతన చట్టం పై స్థానిక కౌన్సిలర్ లకు జిల్లా కలెక్టర్ శ్రీధర్, అడిషనల్ కలెక్టర్ మను చౌదరి గతంలో అవగాహన కల్పించారు.

కలెక్టర్ అవగాహన కల్పించినా అర్ధం కాలేదా?

ముఖ్యంగా ఆ రోజు చెప్పిన విషయం ఏమిటంటే ఎవరు కూడా కౌన్సిలర్స్ నేరుగా కూల్చివేత తదితర నోటీసులు జారీ చేయకూడదు. మున్సిపల్ కార్యాలయం నుండి నోటీసులు ఇస్తారు. రెస్పాండ్ కాకపోతే కోర్టు ద్వారా ఇప్పిస్తారు. అక్కడికీ రెస్పాండ్ కాకపోతే మున్సిపల్ అధికారులు కోర్టు అనుమతులతో చర్యలు తీసుకుంటారు.

అంతేగాని ఎవరు నేరుగా కూల్చేయడాలు, నోటీసు ఇవ్వడం చేయరాదని, శాంతి భద్రతలకు భంగం కలిగించ రాదని ఆరోజు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఈ విషయాన్ని ఇక్కడి స్థానిక నాయకులు మరిచారు. ఎలాంటి ఆదేశాలను నోటీసులు సూచనలు ఇవ్వకుండా నేరుగా కూల్చేయడంపై గొడవ జరిగింది.

చైర్ పర్సన్, వైస్ చైర్మన్ కూలగొట్టమంటేనే కూలగొట్టాను

చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఫోన్ చరేసి చెబితేనే జేసీబీ తో అక్కడికి వెళ్ళాను. నాపై దాడి చేశారని ఆ వార్డు కౌన్సిలర్ గా పోటీచేసిన మల్లయ్య చెప్పారు. ఇలాంటి సంఘటనలు జరగడానికి ముఖ్య కారణం అవగాహన లేకుండా, చట్టాలు తెలుసుకోకుండా ఇష్టానుసారంగా పని చేసే వారు ఉండటమే.

పట్టణ ప్రగతి అంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, రోడ్లు, మురికి కాల్వలు పరిశుభ్రంగా ఉంచుకోవడమా లేక నోటీసులు లేకుండా ప్రయివేటు ఆస్తులు కూలగొట్టడమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనకు అనుమతులు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Related posts

టర్కీ ఎటాక్ :సిరియాలో హెలికాఫ్టర్​పై రాకెట్​ దాడి

Satyam NEWS

ఫోర్జరీ రిజిస్ట్రేషన్ పై ముఖ్యమంత్రికి ఫిర్యాదు

Satyam NEWS

నేచుర‌ల్ స్టార్ నాని రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో సాంగ్ `ఫిఫిఫీ…ఫిఫీ..ఫి

Satyam NEWS

Leave a Comment