39.2 C
Hyderabad
May 3, 2024 15: 01 PM
Slider తూర్పుగోదావరి

ఫేస్ బుక్ తో పరిచయంతో బ్యాంకు ఖాతా కొల్లగొట్టిన లేడీ కిలాడీ

#onlinecheating

ఫేస్‌బుక్‌లో పరిచయమైన మహిళతో చాటింగ్‌ చేస్తున్న ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా వివరాలు తెలియజేయడంతో ఏకంగా రూ.2.57లక్షలు కోల్పోయి తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గొల్లప్రోలు పట్టణానికి చెందిన వై.గోపాలకృష్ణకు మానస అనే మహిళ ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. ఆమెతో అతడు చాటింగ్‌ చేసేవాడు. ఈ క్రమంలో తన కోటక్‌ బ్యాంకు ఖాతాను గోపాలకృష్ణ స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఖాతాకు బెనిఫిషియర్‌ అకౌంట్‌గా అనుసంధానం చేయమని మానస కోరింది. దీంతో గోపాలకృష్ణ ఖాతాను అనుసంధానించాడు. కొన్నిరోజులు బాగానే ఉన్నా ఫిబ్రవరి 17న రూ.2.57 లక్షలను తన బ్యాంకు ఖాతా నుంచి మానస ఖాతాకు బదిలీ చేసుకుంది. తదనంతరం మొహం చాటేసింది. దీంతో మోసపోయినట్లు గుర్తించిన గోపాలకృష్ణ గొల్లప్రోలు పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు గొల్లప్రోలు ఎస్‌ఐ రామలింగేశ్వరరావు తెలిపారు.

Related posts

మలేరియా నియంత్రణ దిశగా జాగ్రత్త చర్యలు

Satyam NEWS

మట్టిఖర్చుల విషయంలో కూడా విఆర్ఏ లకు జగన్నన్న మోసం

Satyam NEWS

గిరిజనుల సంక్షేమం కోసం విశేష కృషి చేస్తున్న ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment