28.7 C
Hyderabad
May 5, 2024 07: 12 AM
Slider పశ్చిమగోదావరి

గ్రేడింగ్ చేయడం ద్వారా నిమ్మ ఉత్పత్తులకు మేలైన మార్కెటింగ్

#kotaru

నాణ్యమైన నిమ్మ ఉత్పత్తుల ను అధునాతన టెక్నాలజీ మిషన్ ల ద్వారా గ్రేడింగ్ చేయడం ద్వారా నిమ్మ రైతులు తగిన గిట్టుబాటు ధర పొందవచ్చని దెందులూరు శాసన సభ్యులు కొటారు అబ్బయ్య చౌదరి అన్నారు. ఏలూరు జిల్లా  పెదవేగి మండలం లక్ష్మీపురం లో ఉన్న దెందులూరు మార్కెట్ యార్డ్ లో రైతుల సౌకర్యార్థం మార్కెట్ కమిటీ కొనుగోలు చేసిన నిమ్మకాయల గ్రేడింగ్ మిషన్ ను ఎం ఎల్ ఏ అబ్బయ్యచౌదరి బుధవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎం ఎల్ ఏ మాట్లాడుతూ నిమ్మ ఉత్పత్తుల ఎగుమతిలో దెందులూరు మార్కెట్ కమిటీ ప్రధమ స్థానంలో ఉందన్నారు. దెందులూరు నియోజకవర్గ పరిధి రైతులకు మార్కెట్ కమిటీ మెరుగైన సేవాలందిస్తుందని తెలిపారు.రానున్న రోజులలో దెందులూరు మార్కెట్ కమిటీలో రైతుల ఉత్పత్తుల నిల్వలకు కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు కూడా చేయనున్నామని తెలిపారు. మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు మరిన్ని మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషిచేస్తానని ఎం ఎల్ ఏ అబ్బయ్యచౌదరి తెలిపారు.

ఈ కార్యక్రమంలో పెదవేగి ఎం పి పి తాతా రమ్య, ప్రస్తుత ఆపద్ధర్మ మార్కెట్ కమిటీ చైర్మన్ మేకా లక్ష్మణరావు, పెదవేగి సోసిటీ చైర్ పర్సన్ పెనుమాక వెంకట సుబ్బారావు, పెదవేగి మండల సచివాలయాల కన్వీనర్ కేసిన సతీష్, డి సి సి బి డైరెక్టర్ తాతా సత్యనారాయణ, కొనకళ్ల వెంకన్న, రైతులు ఆలపాటి రంగారావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మసీదు,ఈద్గాలకు మౌలిక వసతులు కల్పించండి

Satyam NEWS

రామతీర్థం బొడికొండకు ప్రముఖుల తాకిడి

Satyam NEWS

Movie Up Date: విశాఖలో కోతి కొమ్మచ్చి

Satyam NEWS

Leave a Comment