34.7 C
Hyderabad
May 5, 2024 02: 00 AM
Slider హైదరాబాద్

జ‌నావాసాల్లోకి చిరుత‌.. ఐటీ కారిడార్‌లో ప్ర‌త్య‌క్షం?!

chi-1

జంతువులు నివ‌సించే స్థ‌లాల‌ను కాస్త మ‌నుషులు ఆక్ర‌మించుకున్నారు.. పాపం అవి మాత్రం ఏం చేస్తాయి.. ఆక‌లిని త‌ట్టుకోలేక ఎక్క‌డ వాటికి ఆహారం దొరుకుతుందో అక్క‌డ‌కే వెళ‌తాయి. స‌హ‌జంగానే జీవ‌కోటిలో మ‌నుగ‌డ సాగిస్తున్నఏ ప్రాణికైనా క్షుద్భాద తెలియంది కాదు… దాంతో అట‌వీ ప్రాంతంలో నుంచి జ‌నార‌ణ్యాల్లోకి అట‌వీ మ్ర‌గాలు వ‌చ్చి త‌మ వేట‌ను చేజిక్కించుకొని క‌డుపు నింపుకుంటున్నాయి.

తాజాగా గ‌చ్చి బౌలి ఐటీ కారిడార్‌లో ఓ చిరుత క‌ల‌క‌లం స్ర‌ష్టించింది. రోడా మిస్త్రీ కాలేజ్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌లో చిరుత వ‌చ్చి త‌న ఆహారాన్నికాస్త కుక్కను చంపి ఎత్తుకెళ్లింది. కాలేజీలో ప‌నిచేస్తున్నవారు కాస్త యాజ‌మాన్యానికి ఈ విష‌యం తెలియ‌జేయ‌డంతో యాజ‌మాన్యం అట‌వీశాఖాధికారుల‌కు ఫిర్యాదు చేశారు. అట‌వీశాఖాధికారులు ఆ ప్రాంతాన్నిగ‌మ‌నించి చిరుత సంచారం నిజ‌మో? కాదో? ఇప్పుడే ఏం చెప్ప‌లేమ‌ని, ఆ ప్రాంతంలో ర‌క్త‌పు మ‌ర‌క‌లు మాత్రం నిజ‌మేన‌ని నిర్ధారించారు. ఈ ప్రాంతంలో కెమెరాల‌ను అమ‌రుస్తామ‌ని, అటుపిమ్మ‌ట చిరుత సంచారం నిజ‌మా? కాదా అన్న‌ది తేలుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. వారు చెప్పింది నిజ‌మే క‌దా! క‌ళ్ల‌తో చూస్తే కానీ దేన్ని(ఎవ్వ‌రైనా) నిర్ధారించ‌లేం.

ఇక ఇటీవ‌లే ర‌ద్దీ ప్రాంత‌మైన రాజేంద్ర‌న‌గ‌ర్‌లోని శంషాబాద్‌కు ద‌గ్గ‌ర‌లో చిరుత వ‌చ్చి నానా హంగామా స్ర‌ష్టించి.. అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీలో ఉన్న స‌మీప కాల‌నీల్లోని జంతువుల‌ను వేటాడింది. ఎట్ట‌కేల‌కు ఆ చిరుత‌ను అధికారులు బంధించారు. ఇక ఈ చిరుత (గ‌చ్చిబౌలిలో)ని ఎప్పుడు బంధిస్తారో? ఇంత‌కీ అదీ చిరుతేనే కాదో? ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు.

Related posts

కొత్తకోట నలువైపులా రోడ్డు విస్తరణ చేపట్టాలి

Sub Editor

రివర్స్ గేర్:కెనాల్ లో కారు పడి దంపతులు మృతి

Satyam NEWS

దాసన్నపేట సభా స్థలిని పరిశీలించిన ఆదితీగజపతిరాజు

Satyam NEWS

Leave a Comment