40.2 C
Hyderabad
May 2, 2024 15: 34 PM
Slider మహబూబ్ నగర్

కొత్తకోట నలువైపులా రోడ్డు విస్తరణ చేపట్టాలి

Vanaparthi

వ‌న‌ప‌ర్తి జిల్లాలోని కొత్తకోట పట్టణానికి నలువైపుల ప్రధాన రహదారులకు ఇరువైపుల ఒకేసారి రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. కొత్తకోట పట్టణంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల అంశంపై బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పలు అంశాలపై చర్చించి ప్రధానంగా ఐదు డిమాండ్లు పరిష్కరించాలని తీర్మానించారు.

రోడ్డుకు ఇరువైపుల 50 ఫీట్లతో విస్తరణ చేపట్టాలి

రోడ్డుకు ఇరువైపుల డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి

కొత్తకోట పట్టణంలో వనపర్తి నుండి ఆత్మకూరు వెళ్లే రహదారిలో కూడా రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలి

యూటర్న్ లు ఎక్కడ పడితే అక్కడ కాకుండా ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటిస్తూ పోలీసుల సూచనతో అవసరం ఉన్నచోట మాత్రమే ఏర్పాటు చేయ‌డం.

పాద‌చారుల కోసం రోడ్డుకు ఇరువైపుల ఫుత్ పాత్ లు ఏర్పాటు చేయాలి

ఈ సమావేశంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి నరేందర్ రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గండు రవీందర్ గౌడ్, బీసీ యువజన సంఘం మండల అధ్యక్షుడు అంజన్నయాదవ్, ప్రధాన కార్యదర్శి నక్క రాములు పాల్గొన్నారు.

Related posts

ఆక్సిజన్ లేక విలవిల… అధికార మదంతో చురచుర

Satyam NEWS

బాన్సువాడలో మంజీర మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం

Satyam NEWS

క్లీన్ ఇమేజ్ ఉన్న టీఆర్ఎస్ క్యాండిడేట్ వాణిదేవి

Satyam NEWS

Leave a Comment