37.2 C
Hyderabad
May 6, 2024 11: 16 AM
Slider హైదరాబాద్

వేగ నియంత్ర‌ణ‌లో వాహ‌న‌దారుల్లో మార్పు వ‌స్తుందా?

Acc-1

వేగం క‌న్నా ప్రాణం మిన్నా.. మితిమీరిన వేగం వ‌ద్దు.. ప్రాణాలే ముద్దు.. స్పీడ్ థ్రిల్స్‌.. బ‌ట్ ఈజ్ కిల్స్‌.. అంటూ ప్ర‌భుత్వం, పోలీసులు, సామాజిక కార్య‌క‌ర్త‌లు, సంఘాలు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు నెత్తి నోరు కొట్టుకుంటున్నా… కొంద‌రు వాహ‌నదారులు మితిమీరిన వేగంతో ప్ర‌యాణిస్తూ త‌మ ప్రాణాల మీద‌కు తెచ్చుకోవ‌డ‌మే గాకుండా వారి వారి కుటుంబాల్లో విషాదం నెల‌కొల్పుతున్నారు. మ‌హాన‌గ‌రం (హైద‌రాబాద్లో) పోలీసులు, ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు వేగం ప‌రిమితిపై ఆయా చోట్ల అనేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. అయినా ప్ర‌యాణికుల్లో మాత్రం మార్పు అత్యంత త‌క్కువ‌గా క‌నిపిస్తోంద‌ని వాపోతున్నారు.

కారును ఢీకొన్న టిప్ప‌ర్‌.. ఐదుగురు ‌మృతి

తాజాగా గ‌చ్చిబౌలిలో నేడు తెల్ల‌వారుజామున 3 గంట‌ల ప్రాంతంలో జ‌రిగిన ప్ర‌మాదంలో ఐదుగురు ‌మృతిచెందారు. అత్యంత వేగంగా వ‌స్తున్న‌కారు సిగ్న‌ల్‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా వేగంగా అలాగే ముందుకెళ్ళింది. దీంతో ఆవ‌లి వైపు నుంచి వ‌స్తున్న (గ్రీన్ లైట్ వెలుగుతున్న‌ప్పుడు) వ‌స్తున్న టిప్ప‌ర్ లారీ కాస్త కారును వేగంగా ఢీకొన‌డంతో ఓ వైపు కారు నుజ్జు నుజ్జు కాగా, మ‌రో వైపు టిప్ప‌ర్ లారీ కూడా బోల్తా కొట్టింది. స‌మాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటీన సంఘ‌ట‌నా స్థ‌లానికి చేర‌కొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్ట‌గా అప్ప‌టికే కారులో ప్ర‌యాణిస్తున్న న‌లుగురు కాట్రగడ్డ సంతోష్‌, చింతా మనోహర్‌, పప్పు భరద్వాజ్‌, కొల్లూరు పవన్‌కుమార్‌లు మ‌ర‌ణించారు. నాగిశెట్టి రోషన్ కోన ప్రాణాల‌తో కొట్టుమిట్టాడుతుండ‌గా పోలీసులు ఆసుప‌త్రికిత‌ర‌లించారు. అత‌డు చికిత్స పొందుతూ ‌మృతి చెందాడు. వీరంతా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన వివిధ జిల్లాల‌కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

పోస్టుమార్టం నిమిత్తం ‌మృత‌దేహాల‌ను ఉస్మానియా ఆసుప‌త్రికి త‌ర‌లించి కేసు న‌మోదు చేసి పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Related posts

మంత్రులకు రైతుల నిరసన సెగ

Satyam NEWS

దళితుల భూముల్లో మెగా పార్కు నిర్మించవద్దు

Satyam NEWS

అందరిని గౌరవించడం హైదరాబాద్ కల్చర్

Satyam NEWS

Leave a Comment