37.7 C
Hyderabad
May 4, 2024 11: 35 AM
Slider జాతీయం

‘‘నా డబ్బు అంతా ఇచ్చేస్తాను మా అబ్బాయిని తిరిగి తెస్తారా?’’

#Salman Tahir

నా కుమారుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు. 21 సంవత్సరాలు మాత్రమే. రోగ నిరోధక శక్తికి ఢోకాలేదు. అంతే కాదు అతను నాలుగో సంవత్సరం ఎంబిబిఎస్ విద్యార్ధి. అతని పేరు సల్మాన్ తాహిర్. నాలాగా, వాడి తండ్రిలాగా డాక్టర్ అయి ప్రజలకు ఎంతో సేవ చేద్దామని కలలు కన్నాడు.

అందరితో ఎంతో కలుపుగోలుగా ఉండేవాడు…..అయితే 72 గంటల్లో అంతా మారిపోయింది. లాక్ డౌన్ సమయంలో అతడు బయటకే రాలేదు. అతను కేవలం రెండు నిమిషాలు బయటకు వెళ్లాడు. అదీ కూడా తన కారులోనే ఉన్నాడు. మళ్లీ ఐదు నిమిషాలలో తిరిగి వచ్చాడు. రాగానే చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కున్నాడు.

అతడు కేవలం ఇద్దరు వ్యక్తులతోనే మాట్లాడాడు. మధ్యాహ్నం కొంచెం మాత్రమే తిన్నాడు. నేను అతడి శరీర ఉష్ణోగ్రత పరీక్ష చేశాను 99 డిగ్రీలు ఉంది. నేను వెంటనే అతడిని ఐసోలేషన్ లోకి పంపాను. మరో 24 గంటలు గడిచే సరికి శరీర ఉష్ణోగ్రత 101కి పెరిగింది.

కోవిడ్ లక్షణాలే కనిపించలేదు….చివరి వరకూ

నా భర్త, అతను ఒక చిన్న పిల్లల వైద్యుడు, మా అబ్బాయికి మెనింజైటిస్ వచ్చిందని అనుమానించాడు. గొంతు వాపు ఉన్నట్లు చెప్పాడు కానీ వాంతులు అయ్యే లక్షణాలు లేవు. వెంటనే రక్త నమూనాలను పరీక్షకు పంపాం. బ్యాక్టీరియల్ మెనింజైటిస్ అని రిపోర్టు వచ్చింది. రిపోర్టు వచ్చిన అరగంటలో ఆసుపత్రికి షిఫ్ట్ చేశాం.

లుంబార్ పంక్చర్, వైరల్ మెనింజైటిస్ పై డాక్టర్లు దృష్టి సారించారు. వెంటనే మేం కోవిడ్ టెస్టు చేయిద్దామని డాక్టర్లకు చెప్పాం. వారు అవసరం లేదని చెప్పారు. మా అబ్బాయికి గొంతు నొప్పి లేదు, దగ్గులేదు, కడుపు నొప్పిలేదు, చెవి సమస్యలు లేవు. అయితే సీటీ స్కాన్ చేయించాం.

అందులో అతని కంటిలోపల చిన్న వాపు నాకు కనిపించింది. వెంటనే న్యూరో సర్జన్ కు చూపించాను. అది సాధారణమైన వాపేనని ఆయన చెప్పారు. మెనింజైటిస్ వల్ల అలా ఉందని ఆయన చెప్పారు. ఊపిరి తిత్తుల ఎక్సరే తీయమని ఆయన సలహా ఇచ్చారు. అందులో ఒక చిన్న మచ్చ కనిపించింది.

అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించింది

వెంటనే కోవిడ్ పరీక్ష చేయించాను. పాజిటీవ్ వచ్చింది. అకస్మాత్తుగా మా అబ్బాయి కండిషన్ క్షీణించిపోతున్నది. ఆక్సిజన్ స్థాయి పడిపోతున్నది. గుండె కొట్టుకునే వేగం తగ్గిపోతున్నది. గాలి పీల్చేశక్తిని కోల్పోతున్నాడు. న్యుమోనియా సోకింది. బయట నుంచి ఎంత సపోర్టు ఇచ్చినా ఫలితం లేకపోయింది.

వాడు ఈ ప్రపంచాన్ని వదిలివెళ్లిపోయాడు. నా భర్తను ఐసోలేషన్ లోకి పంపారు. నేను ఐసోలేషన్ లోనే ఉన్నాను. నాకు కరోనా నెగెటీవ్ వచ్చింది. మరో నాలుగు రోజుల్లో నా డాక్టర్ వృత్తిని నేను మళ్లీ ప్రారంభిస్తాను…….. ఈ సందర్భంగా నేను నాలుగు విషయాలు మీకు చెబుతాను.

1) కారణం లేకుండా బయట అడుగు పెట్టవద్దు.  మీకు కరోనా సోకక పోయినా మీరు క్యారియర్‌గా మారే ప్రమాదం చాలా పెద్దది. నా కొడుకు విషయంలో ఇదే జరిగింది. ఇద్దరు బయటి వ్యక్తులు క్యారియర్లుగా పనిచేసి ఉంటారు. కాబట్టి ఇంట్లో కూర్చున్న నా కొడుకు ప్రభావితం అయి ఉండవచ్చు.

2) మీరు అవసరం లేకుండా బయటకు రావద్దు ఏ ఆసుపత్రికి వెళ్లవద్దు. ఏ రోగిని పరామర్శించవద్దు.

3) వంధ్యత్వానికి చికిత్స చేసే రోగులను నేను ఇప్పటికీ చూస్తున్నాను.మరో 6 నెలలు వేచి ఉండండి. అనే వారికి చెబుతున్నాను.

4) ప్రభుత్వ నిబంధనలను పాటించండి.  వారు అనవసరమైన భయాన్ని వ్యాప్తి చేస్తున్నారని చెప్పడం తప్పు.  వైద్యుడిగా ఉన్నప్పటికీ, అన్నిటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ, నా హృదయాన్ని నా కళ్ళ ముందు చూడలేనప్పుడు నేను సహాయం కోసం వెతకాలి.

5) డబ్బు కోసం డాక్టర్లు అబద్ధాలు చెబుతున్నారని అంటున్నారు.. నా డబ్బు అంతా ఇస్తాను.  బదులుగా మీరు నా బిడ్డను నాకు ఇస్తారా?

6) నాకు ఇన్ ఫెక్షన్ సోకదు అని భావించే వారితో నేను చెప్పగలిగేది ఏమిటంటే … మీ ప్రియమైన వారిని కూడా తెలియకుండానే చంపేస్తున్నారు …..

“తల్లులు తమ పిల్లలను పోగొట్టుకోవటానికి ఇష్టపడరు”

(కేరళకు చెందిన ప్రముఖ వైద్యురాలు గైనకాలజిస్టు షబ్నమ్ తాహిర్ తన కుమారుడు సల్మాన్ తాహిర్ కరోనాతో మరణించిన సందర్భంగా దేశ ప్రజలకు ఆవేదనతో చెప్పిన మాటలు ఇవి. కరోనా నాకు రాదు అనుకుంటూ వెచ్చల విడిగా తిరుగుతున్న యువతకు ఈ సందేశం కనువిప్పు కలిగించాలని కోరుకుంటూ- సత్యం న్యూస్)

Related posts

నెల్లూరులో కిడ్నాప్ సృష్టించిన కలకలం

Satyam NEWS

ఎగ్జిట్ ట్రెండ్: దేశభక్తిని ఊడ్చేసిన చీపురు పార్టీ

Satyam NEWS

వైయస్ షర్మిలకు 2+2 భద్రత పెంపు

Satyam NEWS

Leave a Comment