37.2 C
Hyderabad
May 6, 2024 19: 15 PM
Slider ముఖ్యంశాలు

హత్య కేసులో యావజ్జీవ శిక్ష విధించిన మహిళా జడ్జి…!

#murdercase

ఏడాదిన్నర క్రితం విజయనగరం జిల్లా కొత్తవలసలో జరిగిన ఓ ఇల్లాలు హత్య కేసులో భర్తే హంతకుడు అంటూ అప్పట్లో కొత్తవలస ఎస్ఐ కేసు ఫైల్ చేయడం…తాజాగా… ఆ కేసులో… ప్రస్తుత కొత్త వలస సీఐ బాలసూర్యారావు.. కోర్ట్ కానిస్టేబుల్ చేపట్టిన, తీసుకున్న చర్యల ఫలితంగా… నిందితుడు కి యావజ్జీవ శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధిలో కంటకాపల్లి పంచాయితీ కొత్తూరు గ్రామంలో 2021 ఏడాది లో జరిగిన హత్యపై కొత్తవలస పీఎస్ నమోదైన హత్య కేసులో నిందితుడు ఇనపచప్ప చింతాలుకు జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ డిస్ట్రిక్ట్ మహిళా కోర్టు జడ్జి మీనా దేవి తీర్పు వెల్లడించారు.

జిల్లా కొత్తవలస మండలం, కంటకాపల్లి పంచాయితీ కొత్తూరు కి చెందిన ఇనపచప్ప చింతాలు (61 ) తన భార్య దుర్గమ్మను శారీరకంగా, మానసికంగా వేధించడంతోపాటు, ఆమెను అనుమానించి హత్య చేశాడు. ఈ విషయమై కొత్తవలస పోలీసు స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాది మేరకు అప్పటి కొత్తవలస ఎస్.ఐ. కేసు నమోదు చేయగా, కొత్తవలస సిఐ ఎస్.బాలసూర్యారావు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో అభియోగ పత్రంను దాఖలు చేసారు.

కోర్టు విచారణలో నిందితుడు ఇనపచప్ప చింతాలుపై నేరారోపణలు రుజువు కావడంతో నిందితునికి, డిస్ట్రిక్ట్ మహిళా కోర్టు జడ్జి మీనాదేవి జీవిత ఖైదు మరియు 5000/-ల జరిమానా విధించారు. ఈ కేసులో పోలీసుల తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవీంద్రనాద్ వాదనలు వినిపించగా, కోర్టు కానిస్టేబులు సిహెచ్.వెంకటేష్ కోర్టులో సాక్యులను సకాలంలో హాజరపరిచారు. ప్రాసిక్యూషన్ త్వరితగతిన అయ్యే విధంగా సహకారాన్ని అందించినట్లుగా కొత్తవలస సిఐ ఎస్.బాలసూర్యారావు తెలిపారు.

Related posts

పెరిగిన నిత్యవసర దరలను వెంటనే తగ్గించాలని డిమాండ్

Satyam NEWS

విజ‌య‌న‌గ‌రం రాజీవ్ స్టేడియంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే .!

Satyam NEWS

సమాజంలో నాటక రంగ స్థానం ఎప్పుడూ సుస్థిరమే

Satyam NEWS

Leave a Comment