37.2 C
Hyderabad
May 2, 2024 14: 53 PM
Slider విజయనగరం

నెల్లిమర్ల పోలీసు స్టేషన్ లో లాకప్ డెత్?

#nellimarla

ప్రశాంతత కు మారుపేరైన విజయనగరం జిల్లాలో అదీ జ్యూట్ మిల్లు తో ప్రసిధ్ధి గాంచిన నెల్లిమర్ల పోలీసు స్టేషన్ లో ఓ నిందితుడు లాకప్ డెత్ సంచలనం రేగింది. స్టేషన్ లో సెల్ లో ఉన్న బేతా రాంబాబు.. టేబుల్ పై ఉన్న తాడు తీసుకుని ఉరేసుకున్నాడనేది పోలీసుల కథనం. సకాలంలో సెంట్రీ కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి…జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ చేర్పించారని కూడా పోలీసులు చెబుతున్నారు. అయితే అప్పటికే మృతి చెందడం తో ఘటన దావాలనంలా మారింది. హుటాహుటిన జిల్లా మెజిస్ట్రేట్ స్పందించి విచారణ అధికారిగా ఆర్డీఓ భవానీ శంకర్ నియమించినట్లు అదేశాలిచ్చారు. దీంతో ఆర్డీఓ భవానీ శంకర్ హాస్పిటల్ కు మృతదేహాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు కట్టారని..బంధువులు నుంచీ వివరాలు సేకరిస్తున్నామన్నారు. అయితే ఈ లాకప్ డెత్ పై విజయనగరం ఇంచార్జ్ డీఎస్పీ అనిల్ ను సంప్రదించగా…అతగాడి పై చాలా కేసులు ఉన్నాయన్నారు. ఆర్డీఓ తో విచారణ జరుగుతోందని పోలీసులు జోక్యం ఏదీ లేదన్నారు.

వ్యక్తి మృతిపై మేజిస్టిరియల్ విచారణ

నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల అదుపులో వున్న రాంబాబు అనే వ్యక్తి మృతిపై మేజిస్టిరియల్ విచారణకు ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ ఏ. సూర్యకుమారి తెలిపారు. విజయనగరం రెవెన్యూ డివిజనల్ అధికారి బిహెచ్. భవానీ శంకర్ విచారణ అధికారిగా వ్యవహరిస్తారని వెల్లడించారు. విజయనగరంలోని శాంతి నగర్ కు చెందిన సురేష్ అలియాస్ రాంబాబు అనే వ్యక్తి ఒక కేసు విచారణకు సంబంధించి పోలీసుల అదుపులో వున్న సమయంలో మరణించిన కారణంగా అనుమానాస్పద మృతిగా గుర్తించి మేజిస్టిరియల్ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. కాగా ఈ కేసుకు సంబంధించి ఆర్.డి.ఓ. భవానీ శంకర్ జిల్లా ఆసుపత్రిలో వున్న రాంబాబు మృతదేహాన్ని పరిశీలించారు.

Related posts

కొత్తగూడెం మున్సిపాలిటీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

Satyam NEWS

సీఎం జగన్ విజయనగరం పర్యటనకు విస్తృత బందోబస్తు

Satyam NEWS

అకాల వర్ష బాధితులకు తక్షణ సాయం

Satyam NEWS

Leave a Comment