రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనపై ప్రజాచైతన్యమే లక్ష్యంగా ఈ ఏడాది జనవరి 27వతేదీన కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంతనుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర… 226రోజులు, 3132 కి.మీ.ల మేర అవిశ్రాంతంగా కొనసాగి విశాఖజిల్లా అగనంపూడి వద్ద దిగ్విజయంగా పూర్తయిందని టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. ఈ సుదీర్ఘమైన మజిలీలో యువగళం పవిత్రయజ్ఞాన్ని ముందుకు నడిపించడంలో యువగళం కమిటీల పాత్ర అనిర్వచనీయం. అధికారపార్టీ సైకోలు ఎన్నో కవ్వింపు చర్యలకు పాల్పడినా సంయమనతో లక్ష్యాన్ని చేరుకునేందుకు సహకరించారు. యాత్ర కొనసాగుతున్న సమయంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రేయింబవళ్లు నా వెన్నంటే ఉంటూ సేవలందించారు. దాదాపు ఏడాదిపాటు కుటుంబాలకు దూరంగా మీరు అందించిన సేవలు జీవితంలో మరువలేను అని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ సాధించబోయే అప్రతిహతమైన విజయాలకు మన యువగళం పునాది వేసింది. మరో 3నెలల్లో చంద్రన్న నేతృత్వాన ఏర్పాటయ్యే ప్రజాప్రభుత్వం మీకు అండగా నిలుస్తుంది. చారిత్రాత్మకమైన యువగళం క్రతువులో భాగస్వాములైన ప్రధాన సమన్వయకర్త కిలారి రాజేష్, వివిధ కమిటీల సమన్వయకర్తలు, సభ్యులకు నా కృతజ్ఞతాభినందనలు అని లోకేష్ తెలిపారు.
యువగళం విజయవంతంలో కీలకపాత్ర వహించిన కమిటీలు
1. యువగళం మెయిన్ కోఆర్డినేటర్ – కిలారు రాజేష్.
2. వ్యక్తిగత సహాయక బృందం – తాతా నరేష్, కుంచనపల్లి వినయ్, పిన్నింటి మూర్తి.
3. వాలంటీర్స్ కమిటీ – అనిమిని రవినాయుడు, మానం ప్రణవ్ గోపాల్.
4. ఫుడ్ కమిటీ – మద్దిపట్ల సూర్యప్రకాష్, లక్ష్మీపతి.
5. మీడియా కమిటీ – మెయిన్ కో-ఆర్డినేటర్ బి.వి.వెంకటరాముడు, కాసరనేని జశ్వంత్.
6. పబ్లిక్ రిలేషన్స్ కమిటీ – కృష్ణారావు, కిషోర్, మునీంద్ర, చల్లా మధుసూధన్ రావు ఫోటోగ్రాఫర్స్: సంతోష్, శ్రీనివాస్, కాశీప్రసాద్.
7. అలంకరణ కమిటీ – బ్రహ్మం చౌదరి, మలిశెట్టి వెంకటేష్.
8. అడ్వాన్స్ టీమ్ కమిటీ – డూండీ రాకేష్, నిమ్మగడ్డ చైతన్య, శ్రీరంగం నవీన్ కుమార్, చంద్రశేఖర్, నారాయణస్వామి, కోలా రంజిత్ కుమార్, ప్రత్తిపాటి శ్రీనివాస్.
9. రూట్ కోఆర్డినేషన్ కమిటీ – కస్తూరి కోటేశ్వరరావు (కెకె), కర్నాటి అమర్నాథ్ రెడ్డి.
10. కరపత్రాల పంపిణీ కమిటీ – అడుసుమిల్లి విజయ్, వెంకటప్ప, వంశీ, చీరాల నరేష్, యార్లగడ్డ మనోజ్.
11. సెల్ఫీ కోఆర్డినేషన్ కమిటీ – వెల్లంపల్లి సూర్య, శ్రీధర్ చౌదరి, ప్రదీప్.
12. వసతుల కమిటీ – జంగాల వెంకటేష్, నారా ప్రశాంత్, లీలాధర్, బాబి, రమేష్.
13. తాగునీటి వసతి కమిటీ – భాస్కర్, చిరుమాళ్ల వెంకట్, అనిల్.
14. సోషల్ మీడియా – అర్జున్