27.7 C
Hyderabad
May 4, 2024 09: 04 AM
Slider ప్రత్యేకం

Mad Race:వ్యాక్సిన్ కోసం క్యూ కట్టిన దేశాలు

#Corona Mask

ప్రపంచవ్యాప్తంగా క్షణక్షణం పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు విశ్వమానవాళిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. అమెరికా, బ్రెజిల్,భారత్,రష్యా తదితర దేశాలలో వైరస్ ప్రభావితుల సంఖ్య, సంభవిస్తున్న మరణాలు మహమ్మారి ఉద్ధృతిని స్పష్టం చేస్తున్నాయి.

కరోనా వ్యాధి సోకినవారికి ప్రస్తుతం వినియోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోకిన్,లోపినవిర్, రి టోనివిర్ వంటి ఔషధాల ట్రయల్స్ నిలిపివేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ) తాజాగా ప్రకటించింది. కరోనా పీడితులకు ఈ తరహా మందులు వాడిన కారణంగా దుష్పరిణామాలు సంభవించే ప్రమాదం ఉందని ఆ సంస్థ హెచ్చరిస్తోంది.

అయితే…వైద్యబృందాలు నిర్వహించిన అధ్యయనాల  ప్రకారం పై మందులు సత్ఫలితాలిచ్చిన ట్లు తెలిసింది. డబ్ల్యూ హెచ్ ఓ మాత్రం కరోనా నియంత్రణకు సంజీవనిలా ఉపకరించగల స్టెరాయిడ్  డేక్సా మిథిసోన్ వినియోగిస్తే ఫలితాలు మెరుగ్గా ఉన్నట్లు తెలిపింది. యూకే కి చెందిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయన బృందం పర్యవేక్షణలో జరిపిన పరిశోధనలో ఈ విషయం రుజువైనట్లు తెలిపింది.

క్రిమిసంహారక మందులతో ప్రయోజనం లేదు

2 వేల మంది వైరస్ బాధితులకు స్టెరాయిడ్ డేక్సా మిథిసోన్ ఇవ్వగా వారిలో 35 శాతం కోలుకోవడంతో ఆ ఔషధం ఉత్పత్తిని  పెంచాలని డబ్ల్యూ హెచ్ ఓ  ఉత్పత్తి దారులకు సూచించింది. వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి వాడుతున్న క్రిమిసంహారక మందులు, క్లోరిన్ ద్రావణం వల్ల ఎంతమాత్రం ఉపయోగం లేదని తేటతెల్లం చేస్తోంది.

వీటి వినియోగం కారణంగా ప్రజలు అనేక అనారోగ్య ఇబ్బందులకు గురికాగల ప్రమాదం ఉందని చెబుతోంది. తాజాగా 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు చేస్తున్న  వాదన ప్రకారం… గాలిద్వారా వైరస్ వ్యాప్తికి అవకాశం ఉన్నట్లు డబ్ల్యూ హెచ్ ఓ గుర్తించి కరోనా పీడిత దేశాలకు మార్గదర్శకాలు జారీచేయాలని ఒత్తిడి పెరుగుతోంది.

భౌతిక దూరం పాటిస్తే వైరస్ చస్తుంది

కానీ….భారత్ కు చెందిన సెంట్రల్ సైన్స్ ఇండస్ట్రియల్ రిసోర్స్ డైరెక్టర్ శేఖర్ మండే ఈ తరహా వాదనలో విశ్వసనీయత లేదన్నారు. ఒకరినుంచి మరొకరికి సంక్రమించే ప్రమాదం ఉన్నా భౌతిక దూరం పాటిస్తే వైరస్ కణాలు గాలిలోనే చనిపోతాయని స్పష్టం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వాక్సిన్ ఎప్పటికి వినియోగంలోకి రాగలదన్న విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశీయంగా పరిశోధనలు జరుపుతున్న భారత్ బయో టెక్,జై డాస్ క్యూబా సంస్థలు మొదటి,రెండవ క్లినికల్ ట్రయల్స్ దశలలో నిమగ్నమై ఉన్నాయి. సంవత్సరానికి 10 కోట్ల డోసులు ఉత్పత్తి లక్ష్యంగా ఈ రెండు కంపెనీలు పనిచేస్తున్నాయి.

రెమిడిసివర్ వచ్చేస్తున్నది

దేశీయ ఫార్మా మైలాన్ ‘ డెస్రెమ్’ ఈ నెలలోనే లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. గిలియడ్ సైన్సెస్ రేమిడిసివర్ జనరిక్ వెర్షన్ డ్రగ్ త్వరలో అందుబాటులోకి రానున్నట్లు  సమాచారం. డ్రగ్ సెంట్రల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతించిన డ్రగ్ 100 ఎమ్ ఎల్ డోస్ ఖరీదు రూ.4800/ గా నిర్ణయించారు.

కరోనా వైరస్ పుట్టిన చైనాలో వ్యాధినిరోధక వాక్సిన్ దిశగా చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రానున్న వాక్సిన్ ను భారీస్థాయిలో కొనుగోలు చేసేందుకు చైనా సన్నాహాలు చేస్తోంది. సినోవాక్ బయోటెక్ వాక్సిన్ ఉత్పత్తిని ఇన్ స్టిట్యూషన్  బుటాన్ టన్ సహకారంతో  బ్రెజిల్ లో అతిత్వరలో ప్రారంభించడానికి సంసిద్ధంగా ఉంది.

క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం

9 వేల మంది వలంటీర్లను పరీక్షల నిర్వహణకు సమాయత్తం చేసింది. అమెరికా కూడా వాక్సిన్ వినియోగానికి తొందరపడుతోంది. ఔషధ దిగ్గజం గిలియడ్ ప్రపంచవ్యాప్త ఉత్పత్తిలో అధికమొత్తం కొనుగోలు చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. మొదటి దశలో సుమారు 5 లక్షల డోస్ లు పొందడానికి ఒప్పందం కుదిరినట్లు అమెరికా సాంక్రమిక వ్యాధుల వైద్యనిపుణులు చెబుతున్నారు.

అమెరికా లైసెన్సింగ్ అధికారులు ఆమోదించిన ‘డ్రె    సెం’ జులై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో రాగల ఉత్పత్తి లో 90శాతం అమెరికా కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. సిసిఎంబి,హైదరాబాద్ చైర్మన్ అభిప్రాయం ప్రకారం లక్షించిన ఆగస్ట్ 15 నాటికి వాక్సిన్ రాగల అవకాశం లేనట్లు తేలింది.

….అప్పటి వరకూ మన జాగ్రత్తలో మనం ఉండాలి

దశల వారీ పరీక్షలలో శాస్త్రీయంగా సత్ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రమే వైరస్ పీడితులకు ఇవ్వాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ బారినుంచి తప్పించుకోవడానికి మాస్కుల వినియోగం, వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం పాటించడం, రోగనిరోధక వ్యవస్థ మెరుగుపరిచే సమతుల్య ఆహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని డబ్ల్యూ హెచ్ ఓ తో సహా పలువురు వైద్యనిపుణులు ఇస్తున్న  సలహాలు శిరోధార్యం.

పొలమరశెట్టి కృష్ణారావు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశ్రాంత ఉన్నతాధికారి

Related posts

అన్ని ప్రాంతాలవారి కోరికా రాజ‌ధాని అమరావతే

Satyam NEWS

“నా ఓటే నా భవిష్యత్తు – ఒక ఓటు యొక్క శక్తి”: ఓటరు అవగాహన పోటీలు

Satyam NEWS

జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తే నాశనం అయిపోతారు

Satyam NEWS

Leave a Comment