29.7 C
Hyderabad
May 3, 2024 06: 13 AM
Slider ప్రపంచం

కరోనా వ్యాప్తిపై వ్యాఖ్యానించిన చైనా ప్రొఫెసర్ అరెస్టు

#Xe Xinping

చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి, ప్రభుత్వ వైఫల్యంపై విమర్శ చేసిన ఒక వ్యక్తిని రాత్రికి రాత్రి 20 మంది భద్రతా సిబ్బంది ఎత్తుకెళ్లారు. జూ ఝాన్గ్రమ్ అనే ఈ రచయిత కరోనా వైరస్ పై చైనా తీసుకున్న చర్యలను నిశితంగా విమర్శిస్తూ ఆర్టికల్స్ రాసేవాడు. ఆయన రాసిన ఆర్టికల్స్ అంతర్జాతీయ వెబ్ సైట్ లలో బహుళప్రాచుర్యం పొందాయి.

జూ ను ఎలాంటి కారణం చూపకుండా రాత్రికి రాత్రే తీసుకెళ్లిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ అంతా తనకు తెలుసు అనుకుంటాడని, పరిపాలన మొత్తం స్థంభింప చేసి తన మాట మాత్రమే నెగ్గించుకుంటున్నాడని జూ తన వ్యాసాలలో రాశాడు.

కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో ఎవరి మాట వినకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఇంతటి పరిస్థితి దాపురించిందని ఆయన విమర్శించాడు. ప్రస్తుత్తం చైనాలో కొనసాగుతున్న ఆర్ధిక ప్రతిష్టంభన జాతీయ అవిశ్వాసానికి దారితీస్తుందని అతను అభిప్రాయపడ్డాడు.

సింఘ్యా యూనివర్సిటీకి చెందిన ఈ న్యాయ శాస్త్ర ప్రొఫెసర్ చాలా అంశాలపై సునిశిత విమర్శలు చేస్తాడు. అయితే చైనా భద్రతా దళాలు ఆయన రాస్తున్న విషయాలపై ఆయనను అరెస్టు చేయలేదని చెబుతున్నాయి. ఆయన చెంగ్డూ నగరంలో వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నారని అందువల్లే అరెస్టు చేశామని అంటున్నారు. యూనివర్సిటీలోని ఒక ఇంటిలో ఒంటరిగా ఉండే జూ ను ఇలాంటి నేరంపై అరెస్టు చేయడం అన్యాయమని ఆయన సన్నిహితులు అంటున్నారు.

Related posts

మారని ప్రైవేట్ ఆసుపత్రుల తీరు.. రోగుల నుంచి అధిక ఫీజుల వసూలు

Satyam NEWS

Hire a letter of recommendation writing service for this specified purpose considering that certified LoR writers have gotten the capabilities

Bhavani

కరోనా ఎఫెక్ట్: పదో తరగతి పరీక్షలపై టెన్షన్ టెన్షన్

Satyam NEWS

Leave a Comment