36.2 C
Hyderabad
April 27, 2024 21: 54 PM
Slider కవి ప్రపంచం

ఆషాఢ బోనాలు

#Sandhya Sutravey

బోనాల పండుగ మన

సంస్క్రతికి సంప్రదాయానికి ప్రతీక

శాస్త్రియతకు సంకేతిక

ఆషాఢ మాసంలో అమ్మోరికి

నైవేద్యసమర్పణయే బోనాలు

ఇది తెలంగాణ అన్ని ప్రాంతాల్లో

రాయలసీమ కొన్ని ప్రాంతాల్లో

నిర్వహించటం ఆనవాయితీ

తెలంగాణలో  గోల్కొండ  జగదాంబిక

బోనాలు ఆదిగా మొదలయి సికింద్రాబాదు,

లాల్ దర్వాజా బోనాలతో ,వివిధ ప్రాంతాల్లో

ఒక్కోరోజుగా సమర్పించటం ప్రత్యేకత

అనాదిగా ఆషాఢమాసం తొలకరితో

పచ్చదనం సంతరించుకొని ప్రకృతి శోభాయమానంగా

క్రిమికీటకాలకు ఆలవాలంగా ఈగలు దోమలకు

నిలయంగా అంటురోగాలకు అనువుగా మారుతుంది

దీని నివారణకు పరమాత్మయే పరమపితగా

ప్రకృతియే జగన్మాతగా కొలుస్తూ బోనాలు సమర్పిస్తారు

వివిధ పేర్లతో ఉన్న అమ్మవారి గుళ్ళను శుధ్ధిచేసి

భక్తిప్రపత్తులతో కొత్తకుండలో పసుపు కలిపి

అన్నం వండి ,పచ్చిపులుసు ,ఆకుకూర

పానకాన్ని రెండుకుండలలో అమర్చి

పసుపుకుంకుమ వేపకొమ్మలతో అలంకరించి

పైనగండదీపంపెట్టి తలపైపెట్టుకొని

అమ్మవారికి సాముహికంగా

వెళ్ళి బోనం సమర్పించి,ప్రసాదాన్ని స్వీకరిస్తారు

ఘటాలఊరేగింపు,పోతురాజునృత్యాలు,

రంగంఎక్కటం,భవిష్యవాణిపలకటం,

ఫలహారం బండ్లు,సాంస్కృతికకార్యక్రమాలు

గుళ్ళకు విఐపిల సందర్శనలు

మైకులలో అమ్మోరిపాటలహోరు

ఈ బోనాల పండుగ ప్రత్యేకత

బంధుమిత్రులతో కలిసి ఆనందసంతోషాలతో

జాతరలో పిల్లల ఆటవస్తువుల కొనుకోళ్ళతో

పండుగ రెండురోజులు ఆసాంతం మరుసటి

సంవత్సరానికి ఒక తీపిగుర్తుగా మిగులుతుంది

సంధ్య సుత్రావె హైదరాబాద్ 9177615967

Related posts

కొల్లు రవీంద్రను కలిసిన నారా లోకేష్

Satyam NEWS

అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సద్వినియోగపరుచుకోవాలి

Satyam NEWS

హత్య కేసులో సత్వర చర్యలు: గగ్గోలు పెడుతున్న నిందితులు

Satyam NEWS

Leave a Comment