37.2 C
Hyderabad
April 30, 2024 12: 40 PM
Slider విజయనగరం

“నా ఓటే నా భవిష్యత్తు – ఒక ఓటు యొక్క శక్తి”: ఓటరు అవగాహన పోటీలు

#suryakumari

భారత ఎన్నికల సంఘం వారి ఓటర్ అవగాహన పోటీలను నిర్వహించనున్నట్లు ఆసక్తి గల వారు పోటీలలో పాల్గొని నగదు బహుమతులను గెలుచుకోవచ్చునని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి తెలిపారు.  “నా ఓటే నా భవిష్యత్తు – ఒక ఓటు యొక్క శక్తి”   అన్న నినాదంలో ఐదు కేటగిరిల వారీగా పోటీలను నిర్వహించనున్నామన్నారు.  పాల్గొనే వారు  మార్చి 15 వరకు ఎంట్రీలను పంపవచ్చున్నారు.

సృజనాత్మక వ్యక్తీకరణ ద్వారా ఓటు ప్రాముఖ్యతను  పునరుద్ఝాటించడానికి జాతీయ ఓటర్ అవగాహనా పోటీని భారత ఎన్నికల సంఘం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రారంభించింది.  SVEEP (క్రమానుగత ఓటర్ల అధ్యాపన, నియోజకుల భాగస్వామ్యం) కార్యక్రమం నిర్వహించనున్నదని, అన్ని వయస్సుల వారు ప్రతీ ఓటు ప్రాముఖ్యతపై ఆధారపడిన ఆలోచనలు, ఇతివృత్తంపై తమ ప్రతిభను, సృజనాత్మకను వెల్లడించడమే లక్ష్యంగా పెట్టామన్నారు. 

 “నా ఓటే నా భవిష్యత్తు – ఒక ఓటు యొక్క శక్తి” ఇతివృత్తంగా జాతీయ స్థాయిలో ఐదు కేటగిరిల పోటీలు క్విజ్, నినాదాలు, పాటలు, వీడియో తయారి, పోస్టర్ డిజైన్ పోటీలను నిర్వహిస్తామన్నారు. 

క్విజ్ పోటీకి సంబంధించి సులువైన, మధ్యస్థం మరియు కష్టమైన మూడు స్థాయిల పోటీలు వుంటాయన్నారు. నినాదాల పోటీలో భాగంగా పై ఇతివృత్తింపై ఇతరులకు స్పూర్తినిచ్చేలా ఆకర్షనీయంగా మాటలను నినాదాల రూపంలో చేయాల్సివుంటుందన్నారు. పాటల పోటీలలో కళాకారులు, గాయకులు వారికి ఇష్టమైన సంగీత వాయిద్యాలను ఉపయోగించుకొని పాట కాలవ్యవధి 3 నిమిషాలకు మించకుండ శాస్త్రీయ, సమకాలీన మరియు ఆకర్షణీయమైన వాటితో సహా ఒక పాట మాధ్యమం ద్వారా సృజనాత్మక అభిప్రాయాలను కూర్చి స్పష్టించాలన్నారు. 

వీడియో తయారీలో ప్రధాన ఇతివృత్తంతో పాటు ఓటు శక్తి మహిళలు, అశక్తులు, వయోవృద్థులు,యువత, మొదటిసారి ఓటువేసే ఓటర్ల ప్రాధాన్యతను ప్రదర్శించవలసివుంటుందన్నారు.  భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ప్రకారం వీడియో, పాట మరియు నినాదం ఏదైనా అధికారిక భాషలో ఇవ్వవచ్చున్నారు. పోస్టర్ రూపకల్పన పోటీలో ఆలోచనలను రేకేత్తించే పోస్టర్లను చేయగలిగే కళాకత్మక రూపకల్పనను డిజిటల్ పోస్టర్, స్కెచ్ లేదా చేతితో చిత్రీకరించిన పోస్టర్ ను తయారు చేయవచ్చున్నారు. 

సంస్థాగత కేటగిరి అనగా సంబంధిత కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ చట్టప్రకారం నమోదు చేసిన పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు వంటి సంస్థలు అనీ జిల్లా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అన్నారు. వృత్తిపరమైన కేటగిరి అనగా  వీడియో తయారి, పోస్టర్ తయారి, పాడటం ద్వారా జీనోపాధి ప్రధాన వనరుగా వున్నవారు ఎంపిక చేయబడితే వారు వృత్తి కేటగిరిలో దృవపత్రాన్ని సాక్ష్యంగా సమర్పించాల్సివుంటుందన్నారు. 

ఔత్సాహిక కేటగిరి అనగా సృజనాత్మక తపన కోసం వీడియో, పోస్టర్ తయారి, పాడటాన్ని అభిరుచిగా చేసే వ్యక్తులనుఈ కేటగిరి క్రింద పరిగణించడం జరుగుతుందన్నారు. అవార్డులు, గుర్తింపులకు సంబంధించి ప్రతీ కేటగిరిలో మొదటి ముగ్గురు విజేతలకు విత్తేజకరమైన నగదు బహుమతులు వుంటాయన్నారు.  అదనంగా ప్రతీ కేటగిరికి ప్రత్యేక ప్రస్థావన కేటగిరి క్రింద నగదు బహుమతులు, సంస్థాగత కేటగిరిలో నాలుగు ప్రత్యేక ప్రస్థావన కేటగిరిలు వుంటాయని, వృత్తి పరమైన మరియు ఔత్సాహిక కేటగిరిలకు ఒక్కోక్క దానికి మూడు ప్రత్యేక ప్రస్థానవ బహుమతు వుంటాయన్నారు.  

పాటల పోటీలు సంస్థాగత కేటగిరికి మొదటి (లక్ష), ద్వితీయ (50 వేలు), తృతీయ (30 వేలు) ప్రత్యేక ప్రస్థావన (15 వేలు) క్రింద నగదు బహుమతులు వుంటాయన్నారు.  వృత్తిపరమైన కేటగిరి క్రింద మొదటి (50 వేలు), ద్వితీయ (30 వేలు), తృతీయ (20 వేలు) ప్రత్యేక ప్రస్థావన (10 వేలు) నగదు బహుమతులు వుంటాయని, ఔత్సాహిక మొదటి (20 వేలు), ద్వితీయ (10 వేలు), తృతీయ (7,500) ప్రత్యేక ప్రస్థావన (3 వేలు) నగదు బహుమతులు వుంటాయని తెలిపారు.

వీడియో తయారి పోటీలు సంస్థాగత కేటగిరికి మొదటి (2 లక్షలు), ద్వితీయ (లక్ష), తృతీయ (75 వేలు) ప్రత్యేక ప్రస్థావన (30 వేలు) క్రింద నగదు బహుమతులు వుంటాయన్నారు.  వృత్తిపరమైన కేటగిరి క్రింద మొదటి (50 వేలు), ద్వితీయ (30 వేలు), తృతీయ (20 వేలు) ప్రత్యేక ప్రస్థావన (10 వేలు) నగదు బహుమతులు వుంటాయని, ఔత్సాహిక మొదటి (30 వేలు), ద్వితీయ (20 వేలు), తృతీయ (10 వేలు) ప్రత్యేక ప్రస్థావన (5 వేలు) నగదు బహుమతులు వుంటాయని తెలిపారు.

పోస్టర్ రూపకల్పన పోటీలు సంస్థాగత కేటగిరికి మొదటి (50 వేలు), ద్వితీయ (30 వేలు), తృతీయ (20 వేలు) ప్రత్యేక ప్రస్థావన (10 వేలు) క్రింద నగదు బహుమతులు వుంటాయన్నారు.  వృత్తిపరమైన కేటగిరి క్రింద మొదటి (30 వేలు), ద్వితీయ (20 వేలు), తృతీయ (10 వేలు) ప్రత్యేక ప్రస్థావన (5 వేలు) నగదు బహుమతులు వుంటాయని, ఔత్సాహిక మొదటి (20 వేలు), ద్వితీయ (10 వేలు), తృతీయ (7,500) ప్రత్యేక ప్రస్థావన (3 వేలు) నగదు బహుమతులు వుంటాయని తెలిపారు.

నినాదాల పోటీలో మొదటి బహుమతి 20 వేలు, ద్వితీయ బహుమతి 10 వేలు, తృతీయ బహుమతి 7,500 వేలు ..పాల్గొనే 50 మంది ఒక్కోక్కరికి  2 వేలు చొప్పున ప్రత్యేక ప్రస్థావన బహుమతి వుంటుందన్నారు. క్విజ్ పోటీ విజేతలు ఉత్తేజకరమైన భారత ఎన్నికల సంఘం వస్తువులు మరియు బ్యాడ్జిలను పొందుతారని, పోటీ మూడు స్థాయిలలో పాల్గొనే వారందరికి ఇ-సర్టిఫికేట్ లను అందచేస్తారు. 

భారత ఎన్నికల సంఘంచే నియమించబడిన న్యాయ నిర్ణీతలు పాల్గొంటారన్నారు. ఓటర్ల అవగాహన పోటీకి సంబంధించి పాల్గొనే వారు పోటీ వెబ్ సైట్ http://ecisveep.nic.in/dontest/ లో వివరణాత్మక మార్గదర్శకాలు, షరతులను పాటించాల్సివుంటుందన్నారు.  వారి వివరాలతో పాటు voter-contest@eci.gov.in కు ఎంట్రీలను ఇ-మెయిల్ చేయాలని, క్విజ్ పోటీలో పాల్గొనే వారు పోటీ వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలని, అన్ని ఎంట్రీలను వచ్చే నెల మార్చి 15 లోపల సమర్పించాలని కలెక్టర్ తెలిపారు.

Related posts

తాగు నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలి

Satyam NEWS

వేణుగాణాలంకారంలో కోదండరాముడు

Satyam NEWS

జిల్లా అధ్యక్ష పదవి మాకొద్దు బాబూ

Satyam NEWS

Leave a Comment