అన్నవరంలో అన్యమత ప్రచారం జరుగుతున్నట్లు నిన్న చంద్రబాబునాయుడు చేసిన ఆరోపణలపై వివరణ ఇచ్చే క్రమంలో అది నిజమని అంగీకరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. అన్నవరంలో భజన బృందాలు ఉన్నాయని, వారు చాలా సంవత్సరాలుగా రాముడు,అల్లా,ఏసు ఒక్కడే అని ఓ పాటలో పాడేవారని మంత్రి తెలిపారు. ఈ పాటకు ఇటీవల భక్తులు అభ్యంతరాలు వ్యక్తం చేశారని దాంతో దేవస్థానం అధికారులు ఆ భజన బృందంతో ఆ పాట పాడించడం ఆపివేయించారని మంత్రి అంటున్నారు. నిజానికి సబ్ కా మాలిక్ ఏక్ అని చెప్పే సాయిబాబా ఆలయాలకు వెళ్తున్నాం. సాయిబాబాపై కేసులు పెడదామా? ఎందుకు మీరు ఇలాంటి వివక్షలు చూపెడుతున్నారు. స్వామీజీలకు కూడా చెబుతున్నాను నా సెల్ నెంబర్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అని మంత్రి అన్నారు. గుంటూరులో దుర్గగుడి కూల్చివేత అంటున్నారు. ఆ ఆలయానికి ప్రత్యామ్నాయంగా స్దలం ఇచ్చి అక్కడ ఆలయం నిర్మించడం కూడా జరిగింది. ఆలయంలో పూజారుల మధ్య వచ్చిన విభేదాల వల్ల యాగి చేశారు. స్దానిక పెద్దల అంగీకారంతో దేవాలయం కూలగొట్టాం అని మంత్రి చెప్పారు. ప్రజలలో విశ్వాసాలు పొగొట్టకండి. ముఖ్యమంత్రిగా అన్ని ప్రార్ధనాలయాలకు వెళ్తారు. అందరివాడు జగన్ మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు చేస్తే మీరు నాశనం అయిపోతారు అంటూ మంత్రి శపించారు.
previous post