23.2 C
Hyderabad
May 8, 2024 02: 13 AM
Slider విజయనగరం

పామరుల భాషలో పద్యాలు రచించి మహాకవి యోగి వేమన..!

#Yogi Vemana

సామాన్యులకు అర్ధమయ్యే విధంగా ..జీవిత సత్యాలను…పద్యాల రూపంలో సమాజానికి తెలిపిన మహా యోగి..వేమా రెడ్డి అని విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా కొనియాడారు. ఈ మేరకు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోలీసు కార్యాలయంలో “వేమన జయంతి”ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎం. దీపిక పాల్గొని, వేమన చిత్ర పటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ – పామరులకు అర్థమయ్యే

భాషలో పద్యాలను వినిపించి, అందరిని మెప్పించిన మహా యోగి ,కవి వేమన అన్నారు. వేమన ఒక ప్రజాకవి, సంఘ సంస్కర్త అని, ఆయన పద్యాలను వినని వారు, తెలియని వారుండరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు.

మానవుని హీనస్థితికి కారణమైన వ్యవస్థల పైన, మూఢ నమ్మకాలపైన పోరాడే క్రమంలోను, సర్వ మానవత సమానత్వానికి తన పద్యాల్లో చక్కని పదాలను నిగుణీకృతం చేసారన్నారు. అటువంటి మహనీయుని జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించుకోవడం, భావి తరాలకు స్ఫూర్తిదాయకమని జిల్లా ఎస్పీ ఎం. దీపిక అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఎం.ఎం.సోల్మన్, బొబ్బిలి డిఎస్పీ బి.మోహనరావు, ఎఆర్ డిఎస్పీ

ఎల్. శేషాద్రి, ఎస్బీ సిఐ జి.రాంబాబు, డిసిఆర్బీ సిఐ జె.మురళి, రూరల్ సిఐ టివి తిరుపతిరావు, డిపిఓ ఎఓ వెంకట
రమణ, మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని యోగి వేమన చిత్ర పటానికి పుష్పాలు సమర్పించి,
ఘనంగా నివాళులు అర్పించారు.

Related posts

ఆర్టికల్ 370 రద్దు: తెలంగాణలో హైఅలర్ట్

Satyam NEWS

చిట్టీల పేరుతో మోసం

Satyam NEWS

వెంకటేష్ హీరోగా తెలుగులో ‘అసురన్’

Satyam NEWS

Leave a Comment